Bhubaneswar : ఒక బిందెడు నీరు రూ. 1.30 లక్షలు.. సంతానప్రాప్తి కలుగుతుందని విశ్వాసం!

ఆలయంలో మరీచి గుండం ఉంటుంది. ఈ గుండం చుట్టుపక్కల ఉన్న అశోక చెట్లుంటాయి. వీటి వేర్ల ప్రభావంతో ఆ నీటిలో ఔషధ గుణాలుంటాయని స్థానికులు చెబుతుంటారు...

Bhubaneswar  : ఒక బిందెడు నీరు రూ. 1.30 లక్షలు.. సంతానప్రాప్తి కలుగుతుందని విశ్వాసం!

Water

Updated On : April 10, 2022 / 9:47 AM IST

One Pitcher Of Holy Water : సంతానం లేని వారి బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. సంతానం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కకపోతుండడంతో ప్రత్యామ్నాయ మార్గాల వైపు వెళుతుంటారు. సంతానం కోసం మంత్రాలు, మందులు వాడడం..ఇతరత్రా చేస్తుంటారు. కానీ ఓ ప్రాంతంలో బిందెడు నీటితో స్నానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తులు విశ్వసిస్తుంటారు. ఆ బిందెడు నీటిని దక్కించుకోవడానికి పోటీ పడుతుంటారు. వేలంలో లక్షల రూపాయలు పలుకుతుంటుంది. ఓ దంపతులు రూ. 1.30 లక్షలు వెచ్చించి నీటిని కొనుక్కొన్నారు. ఈ ఘటన ఒడిశా భువనేశ్వర్ లోని ముక్తేశ్వర ఆలయంలో చోటు చేసుకుంది.

Read More : Odisha : అధ్వానస్థితిలో ఉన్న ఇంట్లో రూ. 1.42 కోట్లు, బంగారం

ఆలయంలో మరీచి గుండం ఉంటుంది. ఈ గుండం చుట్టుపక్కల ఉన్న అశోక చెట్లుంటాయి. వీటి వేర్ల ప్రభావంతో ఆ నీటిలో ఔషధ గుణాలుంటాయని స్థానికులు చెబుతుంటారు. లింగరాజస్వామి రుకుణ యాత్ర నిర్వహిస్తుంటారు. ఏటా అశోక అష్టమి ముందు రోజు రాత్రి మరీచి గుండంలోని నీటిని విక్రయించేందుకు వేలం నిర్వహిస్తుంటారు. బడునియోగ్ వర్గానికి చెందిన సేవాయత్ లు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. శుక్రవారం రాత్రి వేలం పాట జరిగింది. తొలి బిందె నీటి ధర రూ. 25 వేలతో ప్రారంభించారు.

Read More : Sharad Pawar: శరద్ పవార్ ఇంటిపై దాడి ఘటనలో లాయర్ సహా 110 మంది అరెస్ట్

ఈ బిందె లక్షల వరకు పోయింది. చివరకు భువనేశ్వర్ లోని బారాముండా ప్రాంతంలో నివాసం ఉండే దంపతులు రూ. 1.30 లక్షలకు పాడి కొనుక్కొన్నారు. రెండో బిందెను కూడా వేలం నిర్వహించగా..రూ. 47 వేలు, మూడో బిందె రూ. 13 వేలకు వరకు వేలం పాట పాడి దక్కించుకున్నారు. మిగతా నీటిని పేదలకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ నీటితో స్నానం చేయడం వల్ల సంతానప్రాప్తి కలుగుతుందని అనారోగ్య సమస్యలు ఉండవని భక్తులు విశ్వాసం.