Onion Prices : వామ్మో.. భారీగా పెరగనున్న ఉల్లి ధరలు.. ముందే కొనేసుకోండి!

వామ్మో.. ఉల్లి మళ్లీ ఘాటెక్కించబోతోంది.. అందుకే ఉల్లిని ముందే కొనేసి ఇంట్లో పెట్టుకోండి.. ఈ పండుగ సీజన్‌లో ఉల్లిపాయల ధరలు పెరగబోతున్నాయట..

Onion Prices : వామ్మో.. భారీగా పెరగనున్న ఉల్లి ధరలు.. ముందే కొనేసుకోండి!

Onion Prices Likely To Remain High This Festive Season On Erratic Monsoon

Updated On : September 10, 2021 / 4:36 PM IST

Onion prices likely to remain high this festive season : వామ్మో.. ఉల్లి మళ్లీ ఘాటెక్కించబోతోంది.. అందుకే ఉల్లిని ముందే కొనేసి ఇంట్లో పెట్టుకోండి.. ఈ పండుగ సీజన్‌లో ఉల్లిపాయల ధరలు పెరగబోతున్నాయట.. కొద్ది రోజుల్లో ఉల్లి ధరలు రెట్టింపు స్థాయిలో పెరిగే అవకాశం ఉందని ప్రముఖ మార్కెట్ రీసెర్చ్ కంపెనీ Crisil అలర్ట్ చేస్తోంది. ఉల్లి ధరలు పెరగడానికి ఇటీవల దేశవ్యాప్తంగా కురిసిన భారీవర్షాలే కారణమని తెలుస్తోంది. ఉల్లిపంటలకు తీవ్ర నష్టం కలగడంతో ఉల్లి కొరత ఏర్పడుతోంది. ఈ పరిస్థితుల్లో ఉల్లి ధర పెరగడం ఖాయమని అంటోంది క్రిసిల్ సంస్థ. భారతదేశంలో ఉల్లిధరలు మరోసారి ఆకాశాన్ని అంటనున్నాయి.

దేశంలో ప్రతి నెల సుమారు 13 లక్షల టన్నుల ఉల్లిపాయలను వినియోగిస్తున్నారు. అందులో సగానికి పైగా ఉల్లి పంట మహారాష్ట్ర నుంచే రవాణా జరుగుతోంది. దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా ఇక్కడి నుంచే ఉల్లిపాయల సరఫరా కొనసాగుతోంది. మహారాష్ట్ర తర్వాతి స్థానంలో కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఉల్లి పంట అధికంగా పండిస్తున్నారు. ఇటీవల తౌటౌ తుఫాను ప్రభావంతో మహారాష్ట్ర, కర్ణాటకలలో ఉల్లిపంట సాగు ఆలస్యమైంది. వర్షాల కారణంగా ఉల్లి పంట ఆలస్యం కానుందని క్రిసిల్‌ పేర్కొంది. దేశంలో ఉల్లి సరఫరాకు 75 శాతం పంట ఖరీఫ్‌ సీజన్‌ నుంచి జరుగుతోంది.
JioPhone Next.. ఫస్ట్ 4G స్మార్ట్ ఫోన్ దీపావళికి లాంచ్!

ఈ సీజన్‌‌లో ఉల్లి పంట చేతికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మరింత ఆలస్యమయ్యేలా ఉందని క్రిసిల్‌ పేర్కొంది. పంట చేతికి వచ్చినా తర్వాత ప్రాసెసింగ్‌, సరఫరా వంటి కారణాల వల్ల ఉల్లి మార్కెట్లోకి వచ్చేందుకు పట్టే సమయం పెరగనుందని తెలిపింది. గత మూడేళ్లలో ఉల్లి ఉత్పత్తి, సరఫరా, మార్కెట్‌ డిమాండ్ దృష్ట్యా రానున్న రోజుల్లో ఉల్లిపాయల ధరలు రెట్టింపు స్థాయిలో పెరగడం ఖాయమని అంటోంది.

ఉల్లి ఖరీఫ్‌ సీజన్‌ పంట ఆలస్యమైనప్పటికీ.. రబీలో ఉల్లి ఉత్పత్తి బఫర్‌ స్టాక్‌ ఉంది. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో వర్షాలతో వాతావరణంలో తేమ పెరుగుతోంది. దీని కారణంగా ఉల్లి త్వరగా పాడైపోతోంది. ఈ సీజన్‌లో వాతావరణ పరిస్థితుల కారణంగా ఉల్లి బఫర్‌ స్టాక్‌ కూడా భారీగా తగ్గిపోయే అవకాశం ఉందని క్రిసిల్‌ చెబుతోంది. అంటే.. రాబోయే దసరా, దీపావళి సీజన్‌ నాటికి ఉల్లి ధరలు భారీగా పెరుగుతాయని క్రిసిల్ అంచనా వేస్తోంది.
Kim Jong Un : భారీగా బరువు తగ్గిన ఉత్తర కొరియా అధ్యక్షుడు.. ఈ ఫోటోలు అతనివే