Opposition Parties Meeting : బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా.. బెంగళూరులో 26 విపక్ష పార్టీల సమావేశం
2024-లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన విపక్షాల ఉమ్మడి కార్యచరణపై చర్చ జరుగుతోంది. విపక్ష కూటమికి కొత్త పేరు, సమన్వయ కర్తల నియామకం, చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఆందోళనలు, సీట్ల పంపకం కోసం కమిటీల ఏర్పాటుపై చర్చిస్తున్నారు.

Opposition parties meeting
Bengaluru Opposition Meeting : కర్ణాటక రాజధాని బెంగుళూరులో విపక్షాల సమావేశం రెండో రోజు కొనసాగుతోంది. సోమవారం విపక్షాల సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి హాజరైన 26 పార్టీల నేతలు హాజరయ్యారు. బెంగళూరులోని తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్‌లో సాయంత్రం 4 గంటల వరకు విపక్ష నేతల సమావేశం జరగనుంది. 2024లో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా, మహాకూటమి ఏర్పాటు కోసం విపక్ష పార్టీల సమావేశం జరుగుతోంది.
2024-లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన విపక్షాల ఉమ్మడి కార్యచరణపై చర్చ జరుగుతోంది. విపక్ష కూటమికి కొత్త పేరు, సమన్వయ కర్తల నియామకం, చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఆందోళనలు, సీట్ల పంపకం కోసం కమిటీల ఏర్పాటుపై చర్చిస్తున్నారు. ఈవీఎంలు, సంస్కరణల కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ కు లేఖలు రాసే అంశాలపై నేతలు చర్చించనున్నారు.
NDA Meeting : ఢిల్లీలో ఎన్డీఏ పక్షాల సమావేశం.. హాజరు కానున్న 38 పార్టీలు
ఢిల్లీ ఆర్డినెన్స్, యూసీసీ, ద్రవ్యోల్బణం, విదేశాంగ విధానం, నిరుద్యోగం తదితర అంశాలపై మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే వ్యూహంపైనా చర్చిస్తున్నారు. గత నెల జూన్ 23న బీహార్ సీఎం నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ఆధ్వర్యంలో పాట్నాలో విపక్ష పార్టీల తొలి సమావేశం సమావేశమయ్యారు.
విపక్షాల సమావేశానికి కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, డీఎంకే, జేడీ(యూ), ఆర్జేడీ, సీపీఐ, సీపీఐ(ఎం), ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం), శివసేన (ఉద్దవ్ థాక్రే వర్గం), సమాజ్ వాదీ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, సీపీఐ (ఎంఎల్), జేఎంఎం, ఆర్‌ఎల్‌డీ, ఆర్ఎస్పీ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, కేరళ కాంగ్రెస్ (మణి), వీసీకే, ఎండీఎంకే, కేడీఎంకే, కేరళ కాంగ్రెస్ (జోసెఫ్), ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ హాజరయ్యాయి.