అమిత్ షా కౌంటింగ్ : IAF దాడుల్లో 250 మంది ఉగ్రవాదులు చచ్చారు

  • Published By: venkaiahnaidu ,Published On : March 4, 2019 / 06:01 AM IST
అమిత్ షా కౌంటింగ్ : IAF దాడుల్లో 250 మంది ఉగ్రవాదులు చచ్చారు

Updated On : March 4, 2019 / 6:01 AM IST

పాకిస్తాన్ లోని బాలాకోట్ లోని జైషే మహమ్మద్ ఉగ్ర శిబిరాలపై గత వారం భారతవాయుసేన జరిపిన మెరుపుదాడుల్లో ఎంతమంది చనిపోయారన్నది ఇప్పటివరకు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు. అయితే వాయుసేన మెరుపుదాడుల్లో 250 మందికి పైగా చనిపోయినట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా డిక్లేర్ చేశారు. ఆదివారం(మార్చి-3,2019) అహ్మదాబాద్ లో నిర్వహించిన బీజేపీ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న అమిత్ షా మాట్లాడుతూ…వాయుసేన మెరుపుదాడుల్లో 250మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయారని తెలిపారు. మెరుపుదాడుల్లో ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారో చెప్పాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న సమయంలో అధికారపార్టీ నుంచి చనిపోయినవారి సంఖ్యను అధికారికంగా బయటపెట్టిన మొదటివ్యక్తిగా అమిత్ షా నిలిచారు.
Also Read : అభినందన్ అరుదైన రికార్డ్ : F-16 కూల్చిన తొలి IAF కమాండర్

ఉరి ఘటన తర్వాత మన భద్రతా బలగాలు పాక్ భూభాగంలోకి వెళ్లి సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించాయని అమిత్ షా అన్నారు. మన జవాన్ల మృతికి పగ తీర్చుకున్నామని తెలిపారు.పుల్వామా ఉగ్రదాడి తర్వాత ఎలాంటి సర్జికల్ స్ట్రైక్స్ ఉండవని అందరూ అనుకున్నారని, కానీ ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం ఎయిర్ స్ట్రైక్ నిర్వహించి 250 మందికిపైగా ఉగ్రవాదులను అంతమొందించినట్లు షా తెలిపారు.

యూఎస్,ఇజ్రాయెల్ తర్వాత జవాన్లపై దాడికి పాల్పడినవారిపై ప్రతీకారం తీర్చుకున్న మూడో దేశంగా భారత్ నిలిచిందని అన్నారు. సూరత్ లోని మరో కార్యక్రమంలో అదే రోజున పాల్గొన్న అమిత్ షా.. గతంలో మన జవాన్లు తలలు తెగిపడేదానికి ఉపయోగించబడేవారిని, అవమానించబడ్డారని కానీ ఇప్పుడు పరిస్థితి వేరని, పాక్ కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చివేయబోయే క్రమంలో పొరపాటున పాక్ భూభాగంలో పడిన మన జవాన్ అభినందన్ వర్థమాన్ 24 గంటల్లోనే దేశానికి తిరిగివచ్చాడని అన్నారు.
Also Read : అభినందన్ తరహా మీసం, హెయిర్ స్టైల్ పై యువత ఉత్సాహం

నరేంద్రమోడీ దృఢ సంకల్సం కారణంగానే ఈ మార్పు సాధ్యమైందన్నారు. అమిత్ షా వ్యాఖ్యలపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. జవాన్లను బీజేపీ రాజకీయాల కోసం వాడుకుంటుందని ఆరోపిస్తున్నారు.  రాజకీయాల కోసం అమిత్ షా ఎయిర్ స్ట్రైక్స్ పాలు పిండుకుంటున్నారని కాంగ్రెస్ నేత మనీష్ తివారీ ఆరోపించారు.

Also Read : రాజకీయం కాదా! : IAF దాడుల్లో 250 మంది ఉగ్రవాదులు చచ్చారు