తిరువనంతపురం ఎయిర్‌పోర్టులో 30కేజీల గోల్డ్ బ్యాగ్ స్వాధీనం

కస్టమ్స్ అధికారులు తిరువనంతపురం ఎయిర్ పోర్టులో 30కేజీల బంగారాన్ని స్వాధీనపరచుకున్నారు. కేరళ రాజధాని తిరువనంతపురం ఎయిర్‌పోర్టులో డిప్లమోటిక్ బ్యాగ్ లో స్మగ్లింగ్ దొరకడం ఇదే తొలిసారి. బ్యాగేజీలో శానిటరీ వేర్ ఉన్నట్లు దానిని యూఏఈ కాన్సులేట్ కు ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం.. 30కేజీల గోల్డ్ దొరికింది. తిరువనంతపురం ఎయిర్ పోర్టులో దొరికిన అతి పెద్ద గోల్ట్ మొత్తం ఇదేనని డైరక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ చెబుతున్నారు.
మూడు రోజుల క్రితం డిప్లమోటిక్ ఇక్కడికి వచ్చింది. కస్టమ్స్ అఫీషియల్స్ యూఏఈ కాన్సులేట్ కు వెళ్లాల్సిన గోల్డ్ పార్సిల్ లో పెద్ద మొత్తంలో బంగారాన్ని కనుగొన్నారు. అయితే ఈ బ్యాగ్ ఎవరికి చెందినదోననే వివరాలపై కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చెబుతున్నారు.
కన్సులర్ రిలేషన్స్ పై వియన్నా కన్వెన్షన్ ఇండియా, యూఏఈ ఇటువంటి వాటిపై పలు సూచనలు చేశారు. పర్సన్, బ్యాగులు, వాహనాలు, బిల్డింగుల్లోనూ చెకింగ్ లు చేశారు. డిప్లమాట్స్ వారి కార్గోలో సేఫ్ గా డెలివరీలు చేస్తున్నారు.
కస్టమ్స్ డిప్లమోటిక్ కార్గోను సెర్చ్ చేయాలని నిర్ణయించుకున్నారు. కార్గోలో కాంట్రాబాండ్ ఉందని కన్ఫామ్ చేసుకున్నాకే దర్యాప్తు చేశారు. లేదంటే వారికి ఫెయిల్యూర్ మాత్రమే ఎదురయ్యేదని టాప్ కస్టమ్స్ అధికారులు అంటున్నారు.