Cars Puncture: హైవేపై అర్ధరాత్రి 50 వాహనాలకు ఒకేసారి పంక్చర్.. ఆ తరువాత ఏం జరిగిందంటే?

కార్లు, లారీలు, ఇతర వాహనాలు మొత్తం 50కిపైగా వాహనాలు వరుసగా పంక్చర్ అయ్యాయి. ఇలా జరగడానికి ప్రధాన కారణం ..

Cars Puncture: హైవేపై అర్ధరాత్రి 50 వాహనాలకు ఒకేసారి పంక్చర్.. ఆ తరువాత ఏం జరిగిందంటే?

cars punctured

Updated On : December 31, 2024 / 2:50 PM IST

Mumbai – Nagpur Highway: ముంబై – నాగపూర్ హైవేపై వింత ఘటన చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం అర్థరాత్రి వేళ హైవేపై ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 50 వాహనాలు వరుసగా పంక్చర్ అయ్యాయి. డిసెంబర్ 29వ తేదీన రాత్రి 11గంటల సమయంలో వాషిం జిల్లాలోని మాలెగావ్, వనోజా టోల్ ప్లాజాల మధ్య ఈ ఘటన జరిగింది. ఈ ఘటనతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. గంటల తరబడి ట్రాఫిక్ జామ్ తో పాటు వాహనాలకు పంక్చర్ కావండంతో వాహనదారులు రాత్రంతా హైవేపైనే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి తలెత్తింది.

Also Read: Raja Singh: న్యూఇయర్ వేడుకల వేళ.. ప్రజలకు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక సూచన

కార్లు, లారీలు, ఇతర వాహనాలు మొత్తం 50కిపైగా వాహనాలు వరుసగా పంక్చర్ అయ్యాయి. ఇలా జరగడానికి కారణం ఇనుప బోర్డు రోడ్డుపై పడి ఉండటమేనని గుర్తించారు. అయితే, హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు అనేక ఇబ్బందులు పడ్డారు. అయితే, ఒకేసారి 50వాహనాలకు పంక్చర్ కావటం ప్రమాదవశాత్తూ జరిగిందా లేదా.. ఉద్దేశపూర్వకంగా ఎవరైనా ఈ చర్యకు పాల్పడ్డారా అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Also Read: న్యూఇయర్ పార్టీ ఇన్విటేషన్‌లో కండోమ్‌, ఓఆర్ఎస్ ప్యాకెట్.. పబ్ నిర్వాహకులకు దిమ్మతిరిగే షాకిచ్చిన పోలీసులు

ముంబై – నాగ్ పూర్ ఎక్స్‌ప్రెస్‌వే, సమృద్ధి మహామార్గ్ అని కూడా పిలుస్తారు. ముంబయి – నాగ్ పూర్ ను కలుపుతూ ఈ రహదారిని నిర్మించారు. ఇది దేశంలోని అతి పొడవైన గ్రీన్ ఫీల్డ్ రోడ్ ప్రాజెక్టుల్లో భాగంగా దీన్ని నిర్మించారు. దీని నిర్మాణం కోసం రూ. 55వేల కోట్లు ఖర్చు చేశారు.