Toor Dal : కందిసాగులో తెగుళ్ల యాజమాన్యం

చౌడు నేలలు,నీటి ముంపుకు గురయ్యే నేలలు కందిసాగుకు పనికి రావు. కందిసాగులో సరైన సస్యరక్షణ చర్యలు ముఖ్యమైన విషయం . రైతులు తగిన జాగ్రత్తలు పాటిస్తే అధిక దిగుబడులను పొందవచ్చు.

Toor Dal : కందిసాగులో తెగుళ్ల యాజమాన్యం

Toor Dal

Toor Dal : ప్రత్తి,మిరప పోగాకులకు ప్రత్యామ్నాయ౦గా అలాగే పెసర,మినుము,సోయాచిక్కుడు,వేరుశనగ లాంటి పైర్లతో మిశ్రమ పంటగా కందిని ఖరీఫ్ లో పండించవచ్చు.కందిని సాధారణంగా తొలకరి పంటగా అనేక ఇతర పంటలతో కలిపి మిశ్రమ పైరుగా సాగుచేస్తుంటారు.కందిని రబీ లో కూడా పండించవచ్చు. నీరు త్వరగా ఇంకిపోయే గరప, రేగడి, చల్కా నేలల్లో మరియు మురుగు నీరు పోయే వసతి గల నల్ల రేగడి నేలల్లో సాగు చేసుకోవచ్చు. చౌడు నేలలు,నీటి ముంపుకు గురయ్యే నేలలు కందిసాగుకు పనికి రావు. కందిసాగులో సరైన సస్యరక్షణ చర్యలు ముఖ్యమైన విషయం . రైతులు తగిన జాగ్రత్తలు పాటిస్తే అధిక దిగుబడులను పొందవచ్చు.

తెగుళ్ల యాజమాన్యం ;

ఎండుతెగులు : ఈ తెగులు సోకినా మొక్కలు పూర్తిగా కానీ మొక్కలో కొంత భాగము గని ఎండిపోతాయి. ఎండిన మొక్కలను పీకి కందము మొదలు భాగము చీల్చి పరిశీలిస్తే గోధుమ వర్ణపు నిలుపు చారలు కానిఓపిస్తాయి. దీని నివారణకు ఈ తెగులు అధికముగా వున్నా పొలములలో పొగాకు లేక జొన్నతో పంట మార్పిడి చేయాలి. ఐసి పియల్ 87119 మరియు 8863 అనే కంది రకములు ఈ తెగులును తట్టుకుంటాయి . మూడు సంవత్సరాలు పంట మార్పిడి పద్ధతి అవలంభించాలి.

వెర్రి తెగులు: ఇది వైరస్ తెగులు. ఈ తెగులు సోకినా మొక్కలేత ఆకుపచ్చ రంగు కలిగిన చిన్న ఆకులు విపరీతముగా తొడుగుతుంది. పూతపూయదు. ఆకుల ఉపరితలం కొద్దిగాముడతలుగా  మారుతుంది. కొన్నిసార్లు ఈ వంధత్వం పాక్షికంగా కొద కలుగవచ్చు. దీని నివారణకు పొలములో ముందుగా ఈ లక్షణములతో కనిపించే ఒకటి రెండును మొక్కలను వెంటనే పీకి కాల్చి వేయాలి. ఈ తెగులు నల్లి వలన వ్యాపిస్తుంది. నల్లి నివారణకు నీటిలో కరిగే గంధం పొడిచి లీటరు నీటికి 3 గ్రా చొప్పున గని 4 .0 మీ.లి. కెలితేన్  మందును కలిపి వారమున కొకసారి రెండు దఫాలుగా పిచికారీ. చేయాలి . ఐ .సి.పి.యల్ 87119 మరియు 227 రకములు ఈ తెగులును తట్టుకొని శక్తి కలదు.

మాక్రోఫోమైన ఎండు తెగులు: మొక్కల కందము పైన నూలు కండె ఆకారము కలిగిన ముదురు గోధుమ వర్ణపు మచ్చలు కన్పిస్తాయి. ఈ మచ్చల చుట్టూ గోధుమ రంగులో వుంది మధ్య భాగము తెలుపు రంగులో ఉంటుంది. తెగులు సోకినా మొక్కలు, కొమ్మలు ఎండిపోతాయి. యం.ఆర్.జి.66 కందిరకము ఈ తెగులును కొంత వరకు తట్టునును.

పంటకోతలు, నిల్వ: కంది పంటను 80 శాతం కాయలు ఎండిన తర్వాత మాత్రమే కోయాలి. ఎందుకంటే పూత రెండు నెలల వరకు వస్తూనే ఉంటుంది . ఎండిన తర్వాత కట్టెలతో కొట్టి కాయల నుండి గింజ వేరు చేయాలి. నిల్వ చేయునప్పుడు పురుగులు ఆశించకుండా ఉండేందుకు బాగా ఆరబెట్టాలి .