ఢిల్లీలో ఆక్సిజన్ బార్ : రండి బాబు రండి..గాలి పీల్చుకోండి

  • Published By: madhu ,Published On : November 27, 2019 / 10:23 AM IST
ఢిల్లీలో ఆక్సిజన్ బార్ : రండి బాబు రండి..గాలి పీల్చుకోండి

Updated On : November 27, 2019 / 10:23 AM IST

రండి బాబు..రండి..స్వచ్చమైన గాలి అమ్మబడును..డబ్బులు చెల్లించండి..సరిపడా.. గాలి పీల్చుకోండి.. ప్రాణాలు కాపాడే ఆక్సిజన్ తమ బార్‌‌లో దొరుకుతుంది..అంటోంది ఓ బార్ యాజమాన్యం. చివరకు గాలి కూడా కొనుక్కోవాల్సిన దుస్తితి ఏర్పడింది. బార్ అంటే.. మద్యానికి సంబంధించినది అనుకోకండి.. ఇది ఆక్సిజన్ బార్. అవును దీనికి ఫుల్ డిమాండ్ ఉంది.

ఎందుకంటే.. విపరీతమైన కాలుష్యంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో వారికి ఈ బార్ కొంత ఉపశమనం ఇస్తోందని అంటున్నారు పర్యావరణ విశ్లేషకులు. ఇంతకీ ఈ ఆక్సీజన్ బార్ ఎక్కడో గుర్తుకొచ్చిందా? అదేనండీ.. మన దేశ రాజధాని ఢిల్లీ. 

ఢిల్లీలో కాలుష్యం అధికంగా వెదజల్లుతోంది. ఢిల్లీలోని సాకేత్‌లోని సెలెక్ట్ సిటీ వాక్ మాల్‌లో ఆక్సీప్యూర్ పేరిట ఓ బార్ వెలిసింది. ఈ బార్ ప్రారంభమైన కొద్ది రోజుల నుంచి ఆదరణ పెరుగుతోంది. చిన్నా.. పెద్ద అనే తేడా లేకుండా ఇక్కడకు వచ్చి స్వచ్చమైన గాలిని పీల్చుకుంటున్నారు.

లెమన్ గ్రాస్, ఆరెంజ్, సినామస్, పెప్పర్ మింట్, స్పియర్ మింట్, యుకలిప్టస్, ల్యావెండర్ వంటి ఏడు ఫ్లేవర్లలో గాలిని సేల్ చేస్తున్నారు. బయట కాలుష్యం విపరీతంగా ఉండడం వల్ల.. స్వచ్చమైన గాలి పీల్చడం కోసం క్యూ కట్టేస్తున్నారు. ఇంతకు ధర ఎంతో తెలుసా 15 నిమిషాల పాటు పీలిస్తే.. రూ. 299 ఛార్జ్ చేస్తారు. 

గాలిలో నాణ్యత తగ్గిపోవడంతో ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. దీంతో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకొంటోంది. అయినా..ఈ సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. వాహనాలను నియంత్రించడానికి సరి బేసి విధానం తీసుకొచ్చారు.

దీనిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భయాందోళనలకు గురవుతున్న నగర వాసులను ఒకేసారి చంపేయండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విబేధాలు పక్కన పెట్టి..కలిసి పనిచేయాలని హితవు పలికింది. 
Read More : విశ్లేషణ: మహారాష్ట్ర రాజకీయాల్లో అందరూ పరాజితులే