Oxygen Leak: ఆసత్రిలో ఆక్సిజన్ ట్యాంక్ లీక్‌..వీడియో

గోవా రాష్ట్రంలోని దక్షిణ గోవా జిల్లా ఆసుపత్రిలో ఆక్సిజన్ ట్యాంక్ లీకైంది.. దీంతో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. వెంటనే స్పందించిన ఆసుపత్రి సిబ్బంది లీకేజీని అరికట్టే ప్రయత్నం చేస్తున్నారు.

Oxygen Leak: ఆసత్రిలో ఆక్సిజన్ ట్యాంక్ లీక్‌..వీడియో

oxygen leak

Updated On : May 11, 2021 / 5:40 PM IST

Oxygen Leak: గోవా రాష్ట్రంలోని దక్షిణ గోవా జిల్లా ఆసుపత్రిలో ఆక్సిజన్ ట్యాంక్ లీకైంది.. దీంతో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. వెంటనే స్పందించిన ఆసుపత్రి సిబ్బంది లీకేజీని అరికట్టే ప్రయత్నం చేస్తున్నారు. 20 మంది సిబ్బంది ఈ లీకేజీని అరికట్టేందుకు పనిచేస్తున్నారు. మంటలు వ్యాపించే అవకాశం ఉండటంతో ఫైర్ ఇంజన్ సిద్ధం చేశారు.

ఇక లీకేజీని త్వరగా అరికట్టకపోతే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగులకు ప్రాణాపాయం తప్పదని ఆందోళన చెందుతున్నారు కుటుంబ సభ్యులు. ఆక్సిజన్ ప్లాంట్లను ఆపరేట్ చేసిన అనుభవం లేకపోవడంతో పలు చోట్ల ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి.

గత నెల 21న కూడా మహారాష్ట్రలోని నాసిక్ పట్టణంలోగల జాకీర్ హుస్సేన్ ఆస్పత్రిలో ఆక్సిజన్ లీకై 22 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఇక ఆక్సిజన్ సమయానికి అందకపోవడంతో ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా తిరుపతి రుయా ఆసుపత్రిలో 11 మంది మృతి చెందారు.