OYO: ఓయో కొత్త రూల్స్.. పెళ్లికాని జంటలకు ఇకపై నో ఎంట్రీ.. తొలుత ఏఏ నగరాల్లో అంటే..

కొత్త చెక్ -ఇన్ పాలసీ ఆధారంగా ఇకమై మీరు ఓయో రూమ్స్ బుక్ చేసుకోవాలంటే ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో ఎక్కడైనా..

OYO: ఓయో కొత్త రూల్స్.. పెళ్లికాని జంటలకు ఇకపై నో ఎంట్రీ.. తొలుత ఏఏ నగరాల్లో అంటే..

OYO New Rules: Unmarried couples will no longer be allowed in Oyo hotels

Updated On : January 5, 2025 / 2:14 PM IST

OYO New Ruals: ప్రేమికులు, పెళ్లికాని జంటలు చాలామంది కాలక్షేపంకోసం ఓయో రూమ్స్ (OYO Rooms) ను ఎంచుకుంటుంటారు. వారికి అత్యంత ఇష్టమైన ప్రదేశాల్లో ఒకటిగా అవి మారిపోయాయి. నూతన సంవత్సరం వేడుకల్లో భాగంగా దేశ వ్యాప్తంగా ఒక్కరోజే మిలియన్ పైగా ఓయో రూమ్స్ బుకింగ్స్ జరిగాయి. దీనిని బట్టి చూస్తే ఓయో రూమ్స్ కు ఏ స్థాయిలో డిమాండ్ ఉందో అర్థమవుతుంది. నిన్నటి వరకు పెళ్లికాని యువతీ యువకులు తమకు నచ్చినప్పుడు ఓయో రూమ్స్ బుక్ చేసుకొని వెళ్లేవారు. కానీ, ఇకనుంచి అలాంటి వారికి బిగ్ షాక్ ఇచ్చింది ప్రముఖ హోటల్ అగ్రిగేటర్ ఓయో (OYO). నూతన సంవత్సరం సందర్భంగా కొత్త రూల్స్ ను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ విషయాన్ని కంపెనీ ఆదివారం వెల్లడించింది.

Also Read: JC Prabhakar Reddy: బీజేపీ మహిళా నేత మాధవీ లతకు క్షమాపణలు చెప్పిన జేసీ ప్రభాకర్ రెడ్డి

నూతన సంవత్సరంలో ఓయో తీసుకొచ్చిన కొత్త రూల్స్ లో ప్రధానమైనది.. పెళ్లికాని జంటలకు రూమ్స్ ఇవ్వరు. కొత్త చెక్ -ఇన్ పాలసీ ఆధారంగా ఇకమై మీరు ఓయో రూమ్స్ బుక్ చేసుకోవాలంటే ఆన్ లైన్ కానీ, ఆఫ్ లైన్ లో ఎక్కడైనా మీకు పెళ్లి జరిగినట్లు ప్రూప్స్ చూపించాల్సిందే. అంటే.. మీకు పెళ్లి జరిగినట్లు నిర్ధారించే ఐడీ ప్రూప్స్ జత చేయాల్సి ఉంటుంది. రూమ్స్ బుక్ చేసుకునే సమయంలో మీ మధ్య రిలేషన్ ఏంటో తప్పనిసరిగా ఆధారాలతో సహా పొందుపర్చాల్సి ఉంటుంది. ఏదైనా సందర్భంలో ఇలాంటి బుకింగ్స్ ను తిరస్కరించే విచక్షణాధికారాన్ని ఓయో తన భాగస్వామి హోటళ్లకు అందించింది.

Also Read: Gambhir: రోహిత్‌-కోహ్లీ రిటైర్‌మెంట్‌పై స్పందించిన గౌతమ్ గంభీర్‌.. ఏమన్నాడంటే?

అయితే, ఇప్పుడికిప్పుడే దేశవ్యాప్తంగా ఈ రూల్స్ అమల్లోకి రాలేదు. తొలుత యూపీలోని మీరట్ నగరంలోని తన భాగస్వామ్య హోటళ్లలో మాత్రమే తక్షణమే ఈ రూల్స్ అమల్లోకి తీసుకురావాలని నిర్ధేశించింది. కొద్దిరోజులు ఈ రూల్స్ అమలుచేసి గ్రౌండ్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా కంపెనీ దీన్ని మరిన్ని నగరాలకు విస్తరించే యోచనలో ఉందని తెలుస్తోంది.

Also Read: IND vs AUS: చేతులెత్తేసిన టీమిండియా.. ఐదో టెస్టులోనూ ఓటమి.. డబ్ల్యూటీసీ ఫైన‌ల్‌కు ఆస్ట్రేలియా

కొత్త రూల్స్ పై ఓయో నార్త్ ఇండియా రీజియన్ హెడ్ పవాస్ శర్మ మాట్లాడుతూ.. ఓయో సురక్షితమైన, బాధ్యతాయుతమైన అతిథ్యం ఇస్తుంది. కుటుంబాలు, విద్యార్థులు, ఒంటరిగా ప్రయాణం చేసేవారికి సురక్షితమైన వసతులు అందించే బ్రాండ్ గా నిలవాలని ఓయో భావిస్తోందని చెప్పారు. ఇప్పటివరకూ వ్యక్తిగత స్వేచ్ఛను గౌవించాం. కానీ, పౌరులతో కలిసి మెరుగైన సేవలు ఇవ్వాలని భావిస్తున్నాం. ప్రస్తుతానికి కొన్ని ఏరియాల్లోనే నూతన విధానాన్ని తీసుకొస్తున్నాం. దీనిపై త్వరలో సమీక్షించి దేశవ్యాప్తంగా మరికొన్ని నగరాలకు విస్తరించాలని భావిస్తున్నామని పవాస్ శర్మ పేర్కొన్నారు.