Bilawal Bhutto India Visit: భారత్ పర్యటనకు పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో.. ఎప్పుడంటే..

2014లో అప్పటి పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ తర్వాత ఆ దేశం నుంచి పాలపక్షంకు చెందిన నాయకులు ఎవరూ భారత్‌లో పర్యటించలేదు.

Bilawal Bhutto India Visit: భారత్ పర్యటనకు పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో.. ఎప్పుడంటే..

Bilawal Bhutto

Updated On : April 20, 2023 / 1:59 PM IST

Bilawal Bhutto India Visit: పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ భారత పర్యటనకు రానున్నారు. బిలావల్ పర్యటన మే4న ఉంటుందని తెలుస్తోంది. మే 5న గోవాలో జరిగే షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) సమ్మిట్‌లో బిలావల్ భుట్టో పాల్గొంటారని తెలిసింది. ఆ సమావేశంకు విదేశాంగ మంత్రుల ప్రతినిధి బృందం హాజరవుతుంది. ఆ బృందంలో పాకిస్థాన్ విదేశాంగ మంత్రి కూడా హాజరవుతారు. 2014లో అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్ తర్వాత పాకిస్థాన్ నుంచి పాలపక్షంకు చెందిన నాయకులు భారత్‌లో పర్యటించలేదు.

Rajnath Singh : రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కరోనా పాజిటివ్

2011 తర్వాత పాకిస్థాన్ విదేశాంగ మంత్రి భారత్‌కు రావడం ఇదే తొలిసారి అవుతుంది. 2011 సంవత్సరంలో హీనారబ్బానీ ఖర్ భారత్‌లో పర్యటించారు. ఆమె తరువాత విదేశాంగ మంత్రుల హోదాలో పాక్ నుంచి ఎవరూ భారత్‌లో పర్యటించలేదు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్  సమావేశానికి భారతదేశం నుంచి ఆహ్వానం అందిందని ఈ ఏడాది జనవరి నెలలో పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. ఆ సమయంలో వారు ఈ కార్యక్రమానికి హాజరవుతారా లేదా అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు.

NASA Satellite: యుక్రెయిన్ ప్రజలను వణికించిన ప్లాష్‌ లైట్.. వీడియో వైరల్.. క్లారిటీ ఇచ్చిన నాసా

2001 లో షాంఘైలో ప్రారంభించిన ఎస్‌సీఓ దాని ఆరు వ్యవస్థాపక సభ్యులైన చైనా, కజకిస్థాన్, కిర్గిజస్తాన్, రష్యా, తజికిస్తాన్, ఉజ్బేకిస్తాన్ లతో పాటు ఎనిమిది మంది పూర్తి సభ్యులను కలిగి ఉంది. 2017లో భారత్, పాకిస్థాన్ దేశాలు పూర్తి సభ్యులుగా చేరాయి. ఈ క్రమంలో భారత్ లో జరగనున్న విదేశాంగ మంత్రుల సమావేశానికి గ్రూప్ లోని సభ్యులందరూ హాజరుకానున్నారు. వారిలో పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో కూడా ఒకరు.