శరీరంలో ఎలాంటి బగ్స్ లేవు: అభినందన్ వైద్య పరీక్షల రిపోర్ట్ వచ్చేసింది
పాకిస్తాన్ చెర నుంచి సురక్షితంగా మాతృభూమికి తిరిగొచ్చిన భారత ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన శరీరంలో ఎలాంటి బగ్స్ లేవని

పాకిస్తాన్ చెర నుంచి సురక్షితంగా మాతృభూమికి తిరిగొచ్చిన భారత ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన శరీరంలో ఎలాంటి బగ్స్ లేవని
పాకిస్తాన్ చెర నుంచి సురక్షితంగా మాతృభూమికి తిరిగొచ్చిన భారత ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన శరీరంలో ఎలాంటి బగ్స్ లేవని ఎంఆర్ఐ స్కానింగ్ ద్వారా డాక్టర్లు నిర్ధారించారు. పాకిస్తాన్ వాళ్లు అభి దేహంలో ఎలాంటి చిప్స్ అమర్చలేదని తేల్చారు. దీంతో అంతా రిలాక్స్ అయ్యారు. మిగ్ 21 విమానం కూలిన సమయంలో కిందకు దూకినప్పుడు, మూకల దాడి ఘటనలో అభినందన్ పక్కటెముకలు స్వల్పంగా దెబ్బతిన్నాయన్నారు. అలాగే వెన్నెముక కింద భాగంలో కూడా స్వల్ప గాయమైందని డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం ఢిల్లీలోని కంటోన్మెంట్ ఆసుపత్రిలో అభినందన్‌కు మెడికల్ టెస్టులు నిర్వహిస్తున్నారు. మరో 10 రోజుల పాటు అభి వైద్యుల పర్యవేక్షణలో ఉంటారు.
పాక్ నిర్బంధం నుంచి భారత గడ్డపై అడుగుపెట్టిన అభినందన్‌కు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అభి శారీరక సామర్ధ్యం తెలుసుకోవడంతో పాటు పాక్ అధికారులు ఔషద ప్రయోగాలు ప్రయోగించి దేశ రహస్యాలు ఏమైనా రాబట్టారా? అభిని హింసించి జాతీయ భద్రతకు సంబంధించిన సున్నిత అంశాలు తెలుసుకున్నారా? అనే విషయాలు తెలుసుకునేందుకు 5రకాల వైద్య పరీక్షలు చేయనున్నారు.
మన భూభాగంలోకి చొరబడ్డ పాక్ F-16 యుద్ధ విమానాన్ని వెంబడిస్తూ మిగ్-21లో వెళ్లిన అభినందన్.. ఫిబ్రవరి 27న పాక్ సైన్యానికి చిక్కారు. ఆయన ప్రయాణిస్తున్న విమానం కూలిపోవడంతో.. పారాచ్యూట్ సాయంతో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో సురక్షితంగా దిగారు. ఇది గమనించిన స్థానికులు అభిని వెంబడించి పట్టుకుని తీవ్రంగా కొట్టి పాక్ ఆర్మీకి అప్పగించారు. ఆ తర్వాత భారత్ తీసుకొచ్చిన ఒత్తిడి ఫలించి అభిని బేషరతుగా విడుదల చేసేందుకు పాక్ అంగీకరించింది. శుక్రవారం(మార్చి-1-2019) రాత్రి పాకిస్తాన్.. అభినందన్‌ను భారత్‌కు అప్పగించింది. అభినందన్ 60 గంటలపాటు పాక్ చెరలో ఉన్నారు. ఆ సమయంలో తనకు ఎదురైన అనుభవాలను ఒక్కొక్కటిగా బయటపెడుతున్నాడు. పాక్ సైన్యం భౌతిక దాడికి దిగలేదు కానీ.. తనను మానసికంగా తీవ్రంగా వేధింపులకు గురి చేసిందని అభినందన్ చెప్పిన సంగతి తెలిసిందే.