ఎవరి ఆదేశాలో తెలుసా : పాకిస్తానీలు 48 గంటల్లో వెళ్లిపోండి

  • Published By: veegamteam ,Published On : February 19, 2019 / 08:51 AM IST
ఎవరి ఆదేశాలో తెలుసా : పాకిస్తానీలు 48 గంటల్లో వెళ్లిపోండి

Updated On : February 19, 2019 / 8:51 AM IST

బికనీర్ : పుల్వామాలో ఉగ్రదాడి దేశంలో తీవ్ర భావోద్వేగాలను రేపింది. భారత్ – పాకిస్తాన్ దేశాల మధ్య అంతంత మాత్రంగా ఉన్న సంబంధాలు ఈ దాడి తర్వాత పూర్తిగా దెబ్బతిన్నాయి. పాక్ ఉత్పత్తులపై సుంకాలను 200 శాతం పెంచేసింది. ఇదే క్రమంలో రాజస్థాన్ రాష్ట్రం బికనీర్ జిల్లా కలెక్టర్ కుమార్ పాల్ గౌతమ్ కీలక ఆదేశాలు జారీచేశారు. బికనీర్ లో పనిచేస్తున్న పాకిస్థానీలు వెంటనే జిల్లా విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు కలెక్టర్. నగరం విడిచి పెట్టి 48 గంటల్లోగా వెళ్లిపోవాలని ఆదేశించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను కూడా జారీ చేశారు.
 

ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని.. జిల్లాలోని హోటళ్లు, లాడ్జిల్లో పాకిస్థానీలను అనుమతించరాదని స్పష్టం చేశారు. ఈ ఆదేశాలు రెండు నెలలు అమల్లో ఉంటాయని ఉత్వర్లుల్లో స్పష్టం చేశారు. పాక్‌ కళాకారులు భారతీయ చిత్ర పరిశ్రమలో పనిచేయడాన్ని నిషేధిస్తున్నట్లు ఆల్‌ ఇండియా సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌ ఇప్పటికే ప్రకటించింది. పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై ఉగ్రసంస్థ జైషే మొహమ్మద్ చేసిన ఆత్మాహుతి దాడిలో 40 మంది జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కలెక్టర్ ఈ ఆదేశాలను జారీ చేశారు.

Read Also : మమ్మల్ని యుద్ధానికి పంపండి: మోడీకి ఖైదీల లేఖ

Read Also : తుపాకీతో కనిపిస్తే కాల్చేస్తాం : జమ్మూ కాశ్మీర్ లో ఆర్మీ హెచ్చరికలు