PAN-Aadhaar Linking : 31 లాస్ట్ డేట్.. ఆ తర్వాత రూ.10 వేలు జరిమానా..!
మీరు ఆధార్ కార్డుకు పాన్ కార్డును లింక్ చేసుకున్నారా? ఇంకా లేదా? అయితే మీకో హెచ్చరిక. రూ.10వేల జరిమానా..(PAN-Aadhaar Linking)

Pan Aadhaar Linking (1)
PAN-Aadhaar Linking : మీరు ఆధార్ కార్డుకు పాన్ కార్డును లింక్ చేసుకున్నారా? ఇంకా లేదా? అయితే మీకో హెచ్చరిక. వెంటనే ఆధార్ తో పాన్ కార్డు అనుసంధానం చేసుకోండి. ఇందుకోసం ఈ నెలాఖరు వరకే గడువు ఉంది. ఆ తర్వాత రూ.10వేల జరిమానా కట్టాల్సిన పరిస్థితి రావొచ్చు.
ఆధార్ పాన్ లింకింగ్ కు సంబంధించి ఇప్పటికే గడువు ముగిసినా.. కరోనా వైరస్ నేపథ్యంలో మార్చి నెల 31వరకు గడువును పొడిగిస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ గడువును మరోమారు పొడిగించే ప్రసక్తే లేదని తేల్చేసిన సీబీడీటీ.. 31లోగా ఆధార్ కార్డుకు పాన్ కార్డును లింక్ చేయని వారిపై రూ.10 వేల జరిమానాను విధిస్తామని హెచ్చరించింది.(PAN-Aadhaar Linking)
Money Tasks March : మార్చి 31లోగా ఇవి తప్పక పూర్తి చేయండి.. లేదంటే అంతే..!
కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందుకోవాలంటే పాన్‌కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయించడం తప్పనిసరి అన్న సంగతి తెలిసిందే. అయినా ఇంకా చాలా మంది పాన్-ఆధార్ లింక్ ప్రక్రియను పూర్తి చేయలేదు. ముఖ్యంగా పన్ను కట్టే వ్యాపారులు, ఉద్యోగులు ప్రతి ఒక్కరూ పాన్, ఆధార్ లింక్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అందుకోసం గడువును ఈ నెలాఖరు వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. తాజాగా గడువు తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో సోమవారం సీబీడీటీ నుంచి జరిమానా హెచ్చరికలు జారీ అయ్యాయి.
గడువు లోగా పాన్ కార్డ్ హోల్డర్లు తప్పనిసరిగా ఆధార్ నెంబర్ లింక్ చేయాల్సిందే. పాన్ కార్డ్ హోల్డర్లు తమ ఆధార్ నెంబర్ లింక్ చేయకపోతే ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని సెక్షన్ 234H ప్రకారం రూ.1,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ చెల్లని పాన్ కార్డ్ ఉపయోగించినట్టైతే రూ.10,000 జరిమానా చెల్లించాలి.
ఆధార్ లింక్ చేయని పాన్ కార్డులను 2022 మార్చి 31 వరకు ఉపయోగించుకోవచ్చు. ఆ తర్వాత ఆ పాన్ కార్డ్ చెల్లదు. చెల్లని పాన్ కార్డులను ఆర్థిక లావాదేవీలకు ఉపయోగించడం చట్ట విరుద్ధం. కాబట్టి జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. గడువు తర్వాత పాన్, ఆధార్ లింక్ చేసినా జరిమానా చెల్లించాలి.
Aadhaar : మీ ఆధార్ ఏ బ్యాంక్ అకౌంట్‌తో లింక్ అయిందో చెక్ చేయండిలా!
ఇప్పటికే ఆదాయపు పన్ను శాఖ అనేకసార్లు గడువు పొడిగించింది. మరోసారి గడువు పొడిగించేది లేదని ఆదాయపు పన్ను శాఖ తేల్చి చెప్పింది. కాబట్టి పాన్ కార్డ్ హోల్డర్లు మార్చి 31 లోగా తమ ఆధార్ నెంబర్ లింక్ చేయాలి.
* పాన్, ఆధార్ నెంబర్లు లింక్ చేయడానికి పాన్ కార్డ్ హోల్డర్లు ముందుగా ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్ https://www.incometax.gov.in/ ఓపెన్ చేయాలి.
* హోమ్ పేజీలోనే Link Aadhaar లింక్ పైన క్లిక్ చేయాలి. మొదట పాన్ నెంబర్ ఎంటర్ చేయాలి. రెండో కాలమ్‌లో ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఆధార్ కార్డులో ఉన్నట్టుగా పేరు టైప్ చేయాలి. తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఒకవేళ మీ ఆధార్ కార్డుపై పుట్టిన సంవత్సరం మాత్రమే ఉంటే I have only year of birth in Aadhaar card సెలెక్ట్ చేయాలి.
* ఆ తర్వాత I agree to validate my Aadhaar details సెలెక్ట్ చేయాలి. తర్వాత Link Aadhaar క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి Validate పైన క్లిక్ చేయాలి. మీ పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ లింక్ అవుతుంది.
ఒకవేళ మీ పాన్, ఆధార్ నెంబర్ ముందే లింక్ అయితే Your PAN is already linked to given Aadhaar అనే మెసేజ్ కనిపిస్తుంది.
ఎస్ఎంఎస్ ద్వారా పాన్, ఆధార్ లింక్ చేయడానికి మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉన్న ఫోన్‌లో ఎస్ఎంఎస్ యాప్ ఓపెన్ చేయండి. New Message ఓపెన్ చేసి UIDPAN అని టైప్ చేసి స్పేస్ ఇవ్వండి. మీ 12 అంకెల ఆధార్ నెంబర్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి 10 డిజిట్ పాన్ నెంబర్ ఎంటర్ చేయండి. ఈ మెసేజ్‌ను 567678 లేదా 56161 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపండి. మీ పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ అవుతుంది.