#BudgetSession2023: ఉభయసభల్లో గందరగోళం.. మధ్యాహ్నం2 గంటలకు వాయిదా
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మూడో రోజు ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడ్డాయి. విపక్షాల ఆందోళనల మధ్య లోక్ సభను స్పీకర్ ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు రాజ్యసభలోనూ గందరగోళం నెలకొంది. దీంతో రాజ్యసభ కూడా మధ్యాహ్నం 2 గంటలవరకు వాయిదా పడింది. ఇరు సభల్లోనూ ప్రతిపక్షాలు ఇచ్చిన నోటీసులపై ప్రభుత్వం చర్చకు అంగీకరించకపోవడమే గందరగోళానికి కారణమైంది.

Parliament Budget Session
#BudgetSession2023: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మూడో రోజు ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడ్డాయి. విపక్షాల ఆందోళనల మధ్య లోక్ సభను స్పీకర్ ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు రాజ్యసభలోనూ గందరగోళం నెలకొంది. దీంతో రాజ్యసభ కూడా మధ్యాహ్నం 2 గంటలవరకు వాయిదా పడింది. ఇరు సభల్లోనూ ప్రతిపక్షాలు ఇచ్చిన నోటీసులపై ప్రభుత్వం చర్చకు అంగీకరించకపోవడమే గందరగోళానికి కారణమైంది.
ఇరు సభలు ప్రారంభం కాగానే ప్రతిపక్ష పార్టీలు నినాదాలు చేశాయి. సభ వాయిదా పడ్డాక ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడుతూ… తాము ఇచ్చిన నోటీసులపై చర్చ జరగాలని అడిగామని, అయితే, తమ నోటీసులను నిరాకరించారని చెప్పారు. తాము అతి ముఖ్యమైన విషయాలను లేవనెత్తుతుంటే వాటిపై చర్చించేందుకు సమయం ఇవ్వడం లేదని అన్నారు.
ఎల్ఐసీ, ఎస్బీఐ, ఇతర జాతీయ బ్యాంకుల్లో పేద ప్రజల డబ్బు ఉందని చెప్పారు. వాటిని కొన్ని సంస్థలను ఇస్తున్నారని ఆరోపించారు. నిన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దేశంలో పెరిగి నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ధరలు, ఎల్ఐసీ, అదానీ గ్రూప్ వివాదం వంటి అంశాలపై ప్రతిపక్షాలు చర్చకు పట్టుబడుతున్నాయి.
Pakistan Economic Crisis: పాకిస్థాన్‌కు మరో తలనొప్పి.. భారీ జరిమానా చెల్లించాలంటున్న ఇరాన్ ..