పార్టీ, ఫ్యామిలీ చీలిపోయాయి : వాట్సాప్‌లో సుప్రియా సులే ప్రకటన

  • Published By: sreehari ,Published On : November 23, 2019 / 07:12 AM IST
పార్టీ, ఫ్యామిలీ చీలిపోయాయి : వాట్సాప్‌లో సుప్రియా సులే ప్రకటన

Updated On : November 23, 2019 / 7:12 AM IST

మహారాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ చక్రం తిప్పింది. శివసేన, కాంగ్రెస్ పార్టీలకు దిమ్మతిరిగేలా షాక్ ఇచ్చింది. తెల్లారితే మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసి చక్రం తిప్పుదామని భావించిన ఈ మూడు పార్టీలను కోలుకోలేని దెబ్బ కొట్టింది బీజేపీ. రాత్రికిరాత్రే మహారాష్ట్ర అధికార పీఠాన్ని తమవైపు లాగేసుకుంది.

నేషలిస్టు కాంగ్రెస్ పార్టీ (NCP) నేత చివర్లో అజిత్ పవార్ ప్లేట్ ఫిరాయించారు. కమలానికి అజిత్ జైకొట్టడంతో ఒక్కసారిగా మహారాష్ట్ర రాజకీయం వేడిక్కింది. మహారాష్ట్ర అధికారం ఒకరాత్రిలోనే బీజేపీ చేతుల్లోకి వెళ్లిపోయింది. అన్ని చకచకా జరిగిపోయాయి. మహారాష్ట్రలో బీజేపీ మరోసారి అధికార పీఠాన్ని అధిరోహించింది. 

మళ్లీ రాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణస్వీకారం చేశారు. అప్పటివరకూ శివసేన, కాంగ్రెస్ పార్టీలకు మద్దతు ఇచ్చినప్పటికీ అజిత్ చివర్లో బీజేపీకి సపోర్ట్ చేయడంతో ఎన్సీపీ నేతలంతా షాక్ అయ్యారు. దీనిపై పార్టీ చీఫ్ శరద్ పవార్ కూడా స్పందించారు. అజిత్ తన వ్యక్తిగతంగా బీజేపీ మద్దతు ఇచ్చారని, దీనికి పార్టీతో ఎలాంటి సంబంధం లేదన్నారు.

బీజేపీ అజిత్ సపోర్ట్ చేయడంపై శరద్ పవార్ కుమార్తె సుప్రియా సులే వాట్సాప్ లో స్పందించారు. పార్టీ, ఫ్యామిలీ రెండూ చీలిపోయాయని అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తన వాట్సాప్ స్టేటస్ ద్వారా ప్రకటించారు. అజిత పవార్ ఒక ఎన్సీపీ నేత మాత్రమే కాదు.. శరద్ పవార్ సోదరుడు కొడుకు కూడా. శరద్ పవార్ తర్వాత ఎన్సీపీ రాజకీయ వారసుడు అనే పేరు ఉంది. తమ కుటుంబంలోనే వ్యక్తిగా ఉన్న అజిత్.. ఒక్కసారిగా బీజేపీకి సపోర్ట్ చేయడంతో పార్టీ నేతలతో సహా పవార్ కుటుంబం కూడా షాక్ కు గురైంది. 
supriya sule