బీజేపీకి రేష్మా పటేల్ రాజీనామా…అన్నీ డొల్ల పథకాలే

పటీదార్ రిజర్వేషన్ ఆందోళన నాయకురాలు రేష్మా పటేల్ శుక్రవారం (మార్చి-15,2019) బీజేపీకి రాజీనామా చేశారు.

  • Published By: sreehari ,Published On : March 16, 2019 / 09:38 AM IST
బీజేపీకి రేష్మా పటేల్ రాజీనామా…అన్నీ డొల్ల పథకాలే

Updated On : March 16, 2019 / 9:38 AM IST

పటీదార్ రిజర్వేషన్ ఆందోళన నాయకురాలు రేష్మా పటేల్ శుక్రవారం (మార్చి-15,2019) బీజేపీకి రాజీనామా చేశారు.

పటీదార్ రిజర్వేషన్ ఆందోళన నాయకురాలు రేష్మా పటేల్ శుక్రవారం (మార్చి-15,2019) బీజేపీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా బీజేపీపై ఆమె తీవ్ర విమర్శలు చేశారు. డొల్ల పథకాలను ప్రమోట్ చేసే మార్కెంటింగ్ కంపెనీగా బీజేపీని అభివర్ణించారు. తాను బీజేపీకి రాజీనామా చేసిన లేఖను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జీతు వాఘానికి పంపినట్లు ఆమె తెలిపారు. పార్టీ కార్యకర్తలను, నేతలను కేవలం డొల్ల పథకాలను మార్కెటింగ్‌ కు మాత్రమే వాడుకుంటున్నందున పార్టీని వదిలిపెట్టాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ప్రధాన రాజకీయ పార్టీలు తనకు టిక్కెట్ ఇవ్వకుంటే పోర్‌ బందర్ లోక్ సభ స్థానానికి లేదా మనవదర్ అసెంబ్లీ నియోకవర్గం నుంచి ఇండిపెండెంట్‌ గా పోటీ చేస్తానని ఆమె ప్రకటించారు.విపక్షాలన్నీ ఒకే వేదికపైకి వచ్చి పోర్‌ బందర్ సీటుపై వారి వైఖరోమిటో స్పష్టం చేయాలని ఆమె కోరారు. ఇక్కడి నుంచి పోటీకి తనకు అవకాశమిస్తే మహిళా ప్రాతినిధ్యం కూడా పెరుగుతుందని రేష్మా పటేల్ అన్నారు.