Pet Dog Name Controversial : ఆ కుక్కను పెట్టిన పేరుతో పిలిస్తే అందరూ షాక్..తెగ తిట్టిపోస్తున్నారు..!!
ఆ కుక్కకు పెట్టిన పేరుతో పిలిస్తే అందరూ షాక్ అవుతున్నారు..షాక్ నుంచి తేరుకున్నాక తెగ తిట్టిపోస్తున్నారు..!! ఇంతకీ ఆ కుక్క పేరు ఏమిటంటే..

Pet Dog Name Controversial
Her Pet Dog Name Covid: పెంపుడు కుక్కలకు టామీ, జిమ్మీ, జాకీ అంటూ పేర్లు పెట్టుకుంటారు యజమానులు. వాటి పేర్లతో పిలవగానే తోక ఊపుకుంటూ వచ్చేస్తాయి పెంపుడు కుక్కలు. అలా ఓ జంట తాము పెంచుకునే కుక్క ఓ వింత పేరు పెట్టుకున్నారు. వారి కుక్కను బయటకు వాకింగ్ కు తీసుకెళ్లినప్పుడు దాన్ని పేరుతో పిలిస్తే ఆ చుట్టుపక్కల ఉన్నవారంతా హడలిపోతున్నారు. ఓరి నాయనో అంటూ పారిపోతున్నారు. ఇంతకీ అంతగా భయపెట్టే ఆ పేరు ఏమిటా? అని ఇంట్రెస్ట్ పెరిగిందా? ఆ మాట వింటే చాలు గత రెండేళ్లనుంచి యావత్ ప్రపంచాన్ని గడగడలాడిపోతోంది. ఎవ్వరిని వదలకుండా హడలెత్తిస్తోంది. ఏంటీ తెలిసిపోయిందా? ఆ పేరు ఏమిటో..హా…అవును మీరు అనుకున్నదే ‘కరోనా’(కోవిడ్)..ఆ పెంపుడు కుక్క పేరు ‘కోవిడ్’..!
కరోనా అనే పేరు మనుషులకు కూడా ఉందనే విషయం బహుశా మీకు తెలిసే ఉంటుంది. కేరళలో ఓ యువతి పేరు కరోనా. ఆమె కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కూడా చేశారు…కొన్ని ప్రాంతాల్లో షాపులకు కూడా కరోనా అని పేరు పెట్టుకున్న విషయం కూడా తెలిసే ఉంటుంది. కానీ ఇప్పటి వరకు పెంపుడు జంతువులకు కరోనా అని పేరు పెట్టుకున్న దాఖలాలు లేవు. అందుకే ఆ కుక్క పేరు కరోనా అని పేరు పెట్టుకోవటానికి కూడా ఓ సందర్భం ఉంది..
ఓ దంపతులకు కరోనా మొదటి వేవ్‌లో ఒక కుక్కపిల్ల దొరికింది. లాక్‌డౌన్ కారణంగా ఆ కుక్క యజమానిని కనుక్కోవడం వారికి కష్టమైంది.దీంతో ఈ కుక్క ఫోటోను తీసి పోస్టర్లు అంటించారు. ఈ కుక్క మీది అయితే మమ్మల్ని సంప్రదించండి అంటూ. కానీ ఎవరూ రాలేదు. దీంతో వారే ఆ కుక్కని పెంచుకుంటున్నారు. కానీ దానికి ఓ పేరు పెట్టాలి అనుకున్నారు. ఆ పేరు సాధారణ కుక్కల పేర్లలా కాకుండా వెరైటీగా ఉండాలనుకున్నారు.అందుకే ఇద్దరు ఆలోచించుకుని కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో దొరకడంతో కోవిడ్ అని పేరు పెట్టారు. అయితే అక్కడ వరకు అంతా బాగానే ఉంది. వారితోపాటు ఆ కుక్కపిల్లను బయటకు తీసుకువెళ్తున్నపుడల్లా ఇబ్బందులే ఎదురయ్యేవి..
కుక్కు బయటకు తీసుకెళ్లినప్పుడు కోవిడ్ అని పిలవంగానే అందరూ విచిత్రంగ చూడటమే గాక అసలు అదేం పేరు అంటూ తిట్టడం మెదలు పెట్టారట. ఇంకే పేరు దొరకలేదా? ఏంటా పేరు వింటనే గుండెలు హడలిపోతున్నాయి అని ముఖంమీదే తిట్టేవారట. మరికొంతమంది ఆ కరోనా మహమ్మారితో మా ప్రియమైన వాళ్లని పోగొట్టుకున్నాం దయచేసి ఆ పేరు విన్నా కోపం వస్తోందంటూ బాధపడుతూనే మండిపడేవారట. ఈ విషయాన్ని ఆ దంపతులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది చదివిన నెటిజన్లు కూడా అదేం పేరు అంటూ చివాట్లు పెట్టడం మెదలు పెట్టారు.