Caste Census: పాట్నా కోర్టు తుది తీర్పు ఇచ్చాక మళ్లీ సుప్రీంకోర్టుకు చేరిన కులగణన అంశం

దీంతో నితీశ్ ప్రభుత్వం కులగణన సర్వేని మళ్లీ ప్రారంభించింది. బీహార్‌లో కుల ఆధారిత గణన పనుల కోసం సాధారణ పరిపాలనా విభాగాన్ని నోడల్ డిపార్ట్‌మెంట్‌గా మార్చిన విషయం తెలిసిందే

Caste Census: పాట్నా కోర్టు తుది తీర్పు ఇచ్చాక మళ్లీ సుప్రీంకోర్టుకు చేరిన కులగణన అంశం

Updated On : August 3, 2023 / 5:30 PM IST

Supreme Court: బీహార్‌లో కుల ప్రాతిపదికన గణన అంశం మరోసారి సుప్రీంకోర్టుకు చేరింది. ఈ కేసులో మంగళవారం పాట్నా హైకోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. పాట్నా హైకోర్టు మంగళవారం ఇచ్చిన తీర్పులో బీహార్‌లోని నితీష్ కుమార్ ప్రభుత్వానికి పెద్ద ఊరటనిచ్చింది. కుల ఆధారిత గణన, ఆర్థిక సర్వేను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లు అన్నింటిని పాట్నా హైకోర్టు కొట్టివేసింది.

Ajit Pawar: అజిత్ పవార్ ముఖ్యమంత్రి కాబోతున్నారా? మొత్తానికి క్లారిటీ ఇచ్చేసిన దేవేంద్ర ఫడ్నవీస్

దీంతో నితీశ్ ప్రభుత్వం కులగణన సర్వేని మళ్లీ ప్రారంభించింది. బీహార్‌లో కుల ఆధారిత గణన పనుల కోసం సాధారణ పరిపాలనా విభాగాన్ని నోడల్ డిపార్ట్‌మెంట్‌గా మార్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ వ్యవహారంపై కొత్త పిటిషన్ దాఖలు చేయడంతో మరోసారి ఈ అంశం సుప్రీంకోర్టుకు చేరింది.

Kunwar Danish Ali: అలా అయితే ప్రతి మసీదు కింద గుడి ఉంటుందట.. జ్ఞాన్‌వాపి మసీదు అంశంపై బీఎస్పీ ఎంపీ

కులం ఆధారంగా జనాభాను లెక్కించడాన్ని కుల గణన అంటారు. దీని ద్వారా సమాజంలో ఏ వర్గానికి ఎంత వాటా ఉందో తెలుసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వివిధ కులాల ఆర్థిక, సమాజిక పరిస్థితులను ఇందులో పూర్తిగా లెక్కిస్తారు. ప్రజల కులం, మతం, విద్య, ఆదాయం గురించి సమాచారాన్ని పొందడం ద్వారా వారి సామాజిక-ఆర్థిక స్థితిని తెలుసుకోవచ్చు.