Petrol Prices: తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు

పెట్రోలు, డీజిల్ ధరల్లో చమురు కంపెనీలు ఎలాంటి మార్పులు చేయలేదు. ఇవాళ(12 జనవరి 2022) పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలో నిలకడగా ఉన్నాయి.

Petrol Prices: తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు

Petrol (2)

Updated On : January 12, 2022 / 10:10 AM IST

Petrol Prices: పెట్రోలు, డీజిల్ ధరల్లో చమురు కంపెనీలు ఎలాంటి మార్పులు చేయలేదు. ఇవాళ(12 జనవరి 2022) పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలో నిలకడగా ఉన్నాయి. నేడు పలు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఏ రేటుకు లభిస్తున్నాయంటే..

హైదరాబాద్‌లో లీటరుకు పెట్రోల్ ధర రూ. 108.20 వద్ద ఉండగా.. డీజిల్ రేటు కూడా స్థిరంగా ఉంది. డీజిల్ ధర లీటరు రూ. 94.62 వద్ద కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతిలోనూ పెట్రోల్ ధర ఇదే దారిలో నడుస్తోంది. రేటులో ఎలాంటి మార్పు కనిపించట్లేదు. పెట్రోల్ రేటు లీటరు రూ. 110.67 వద్ద స్థిరంగా ఉండగా.. డీజిల్ ధరల్లో మార్పు లేదు. డీజిల్ ధర రూ.96.08 వద్ద కొనసాగుతోంది.

ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు:
దేశ రాజధాని ఢిల్లీలో కూడా నేడు పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పు లేదు. ఈరోజు ఢిల్లీలోని పెట్రోల్ పంప్‌లో లీటర్ పెట్రోల్‌ ధర రూ. 95.41గా ఉంది. లీటర్ డీజిల్‌ ధర రూ.86.67గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. బీహార్, రాజస్థాన్ సహా అనేక రాష్ట్రాల్లో పెట్రోలు ఇప్పటికీ రూ.100 పైనే ఉంటున్నాయి.