Rahul Gandhi : పన్ను వసూళ్లలో పీహెచ్డీ
ఇంధన ధరలు అంతకంతకూ పెరగడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి మోడీ సర్కార్ పై ఫైర్ అయ్యారు.

Phd In Tax Recovery Rahul Gandhis Jibe On Centre As Fuel Prices Continue To Rise
Rahul Gandhi ఇంధన ధరలు అంతకంతకూ పెరగడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి మోడీ సర్కార్ పై ఫైర్ అయ్యారు. ప్రజల నుంచి పన్ను వసూలు చేయటంలో కేంద్రం పీహెచ్డీ చేసిందని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. పన్నుల కంటే పెట్రోల్, డీజిల్‌పైనే కేంద్రానికి అధిక ఆదాయం సమకూరిందని పేర్కొంటూ ఓ వార్తా పత్రికలో వచ్చిన కథనాన్ని రాహుల్ తన ట్విట్టర్ లో షేర్ చేశారు.
కాగా, కొద్ది రోజులుగా దేశంలో ఇంధన ధరలు మండిపోతున్న విషయం తెలిసిందే. దేశంలోని అనేక పాంత్రాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 100 దాటిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం భోపాల్‌లో అత్యధికంగా లీటరు పెట్రోల్ రూ. 105.43 ఉంది.