Morbi Bridge Collapse : గుజరాత్ కేబుల్ బ్రిడ్జి ఘటనపై జ్యుడిషియల్ కమిషన్ నియమించాలని కోరుతు సుప్రీంకోర్టులో పిల్ ..

గుజరాత్ లో మోర్బీ కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనపై సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. ఈ ఘటనపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణలో విచారణ జరిపించాలని కోరుతూ పిల్ దాఖలైంది. జ్యుడీషియల్ కమిషన్ నియమించాలే ఆదేశించాలని..పాత వంతెనలు, స్మారక కట్టడాల భద్రతను నిర్ధారించేందుకు సర్వే, రిస్క్ అసెస్మెంట్ కమిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించాలని ప్రజాప్రయోజనాల పిల్ లో పిటీషనర్ పేర్కొన్నారు.

Morbi Bridge Collapse : గుజరాత్ కేబుల్ బ్రిడ్జి ఘటనపై జ్యుడిషియల్ కమిషన్ నియమించాలని కోరుతు సుప్రీంకోర్టులో పిల్ ..

Morbi Bridge Collapse

Updated On : November 1, 2022 / 10:38 AM IST

Morbi Bridge Collapse : గుజరాత్ లో మోర్బీ కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనపై సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. ఈ ఘటనపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణలో విచారణ జరిపించాలని కోరుతూ పిల్ దాఖలైంది. జ్యుడీషియల్ కమిషన్ నియమించాలే ఆదేశించాలని..పాత వంతెనలు, స్మారక కట్టడాల భద్రతను నిర్ధారించేందుకు సర్వే, రిస్క్ అసెస్మెంట్ కమిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించాలని ప్రజాప్రయోజనాల పిల్ లో పిటీషనర్ పేర్కొన్నారు.

Morbi Bridge Collapse: కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో నలుగురి అరెస్టు.. కొనసాగుతున్న విచారణ

గుజరాత్, మోర్బి జిల్లాలో ఆదివారం కేబుల్ బ్రిడ్జి కూలి దాదాపు 141 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై గుజరాత్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దీంతో త్వరితగతిన విచారణ ప్రారంభించిన పోలీసులు ఈ ప్రమాదంతో సంబంధం ఉందని భావించిన నలుగురిని ఇప్పటికే అరెస్టు చేశారు. మరో ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

దాదాపు 143 ఏళ్లక్రితం నిర్మించిన ఈ బ్రిడ్జిని మరమ్మతులు చేసి ఇటీవలే తిరిగి ప్రారంభించారు. ఈ బ్రిడ్జికి సంబంధించిన నిర్వహణ, మరమ్మతుల బాధ్యతను అజంతా ఒవెరా సంస్థకు ఇచ్చారు. పదిహేనేళ్లపాటు దీనికి సంబంధించిన కాంట్రాక్టును కంపెనీ సొంతం చేసుకుంది. కొద్దిరోజుల క్రితమే ఈ కాంట్రాక్టును స్థానిక అధికారులు కట్టబెట్టారు. 2022-2037 వరకు ఈ కాంట్రాక్టు ఉంది. గత వారమే బ్రిడ్జి తిరిగి ప్రారంభమైనప్పటికీ, దీనికి సంబంధించిన ‘ఫిట్‌నెస్ సర్టిఫికెట్’ను మున్పిపల్ అధికారులు ఇంకా మంజూరు చేయాల్సి ఉంది. దీంతో ప్రమాద ఘటన నేపథ్యంలో అధికారులు అజంతా ఒవెరా సంస్థకు చెందిన సిబ్బందిని విచారిస్తున్నారు. అయితే, ప్రస్తుతం అదుపులోకి తీసుకున్న వ్యక్తులు కంపెనీలో కింది స్థాయి ఉద్యోగులే.

దీంతో కంపెనీలోని ప్రధాన వ్యక్తుల గురించి పోలీసులు గాలిస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత నుంచి వీళ్లు కనిపించకుండా పోయారు. వీరిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బ్రిడ్జి నిర్వహణ, మరమ్మతులకు సంబంధించి కంపెనీ అనేక తప్పిదాలకు పాల్పడినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. కేసు తదుపరి విచారణ కొనసాగుతోంది.కాగా ఈ రోజు మంగళవారం (నవంబర్ 1,2022) ప్రధాని మోడీ ప్రమాద ఘటనాస్థలిని పరిశీలించనున్నారు