Pinarayi Vijayan oath : మే 20న విజయన్‌ ప్రమాణ స్వీకారం

కేరళలో కొత్త ప్రభుత్వం మే 20న ప్రమాణ స్వీకారం చేయనుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో LDF ఘన విజయం సాధించడంతో మరోసారి శాసనసభ నాయకుడిగా పినరయ్‌ విజయన్‌ ఎన్నికయ్యారు.

Pinarayi Vijayan oath : మే 20న విజయన్‌ ప్రమాణ స్వీకారం

Pinarayi Vijayan Led Kerala Govt To Be Sworn On May 20

Updated On : May 18, 2021 / 10:55 AM IST

Pinarayi Vijayan oath : కేరళలో కొత్త ప్రభుత్వం మే 20న ప్రమాణ స్వీకారం చేయనుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో LDF ఘన విజయం సాధించడంతో మరోసారి శాసనసభ నాయకుడిగా పినరయ్‌ విజయన్‌ ఎన్నికయ్యారు. సీఎంతో పాటు 21 మంది మంత్రులతో ప్రమాణ స్వీకార కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు గవర్నర్‌ ఆరీఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేశారు.

మే 20 మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు సీఎంతో పాటు క్యాబినేట్‌ మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కోవిడ్‌ నిబంధనలు అమల్లో ఉన్నందున ఈ కార్యక్రమానికి కేవలం 5 వందల మందికే అవకాశం కల్పిస్తున్నారు. కేరళలో రెండోసారి సీఎంగా అధికారం చేపట్టనున్న పినరయ్‌ విజయన్‌ పాలనలో వేగం పెంచారు. కరోనా వ్యాక్సిన్ల కోసం గ్లోబల్‌ టెండర్లను ఆహ్వానించారు.

అంతర్జాతీయ మార్కెట్‌ నుంచి 3 కోట్ల డోసుల టీకాలను కొనాలని సీఎం విజయన్‌ నిర్ణయించారు. ఈ వ్యాక్సిన్లను రాష్ట్రంలో 18 నుంచి 45 ఏళ్ల లోపు ఉన్న వారికి అందివ్వాలని నిర్ణయించారు. ఏపీ సీఎం జగన్‌తో పాటు కేజ్రీవాల్‌, కేసీఆర్‌లు గ్లోబల్‌ టెండర్ల ద్వారా వ్యాక్సిన్లు కొంటామని ఇప్పటికే ప్రకటించారు.