Tiha Jail : తీహార్ జైలు రూములకు ఉండే ఎగ్జాస్ట్ ఫ్యాన్లు తొలగింపు .. రాత్రంతా ఎల్‌ఈడీ లైట్లు

తీహార్ జైలు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ఖైదీలు రూములకు ఉండే ఎగ్జాస్ట్ ఫ్యాన్లు తొలగించాలని నిర్ణయించారు.

Tiha Jail : తీహార్ జైలు రూములకు ఉండే ఎగ్జాస్ట్ ఫ్యాన్లు తొలగింపు .. రాత్రంతా ఎల్‌ఈడీ లైట్లు

Tihar jail

Updated On : June 14, 2023 / 11:36 AM IST

Tihar jail Gangster Tillu incident: తీహార్ జైలు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ఖైదీలు రూములకు ఉండే ఎగ్జాస్ట్ ఫ్యాన్లు తొలగించాలని నిర్ణయించారు. వాటి స్థానంలో ప్లాస్టిక్ ఎగ్జాస్ట్ ఫ్యాన్లు అమర్చాలని నిర్ణయించారు. అంతేకాదు రాత్రి సమయాల్లో చీకటిగా ఉండే ప్రాంతాల్లో నిరంతరం ఎల్ఈడీ లైట్లు వెలిగేలా ఉండాలని నిర్ణయించారు. ఇదంతా కొన్ని వారాల క్రితం గ్యాంగ్ స్టర్ టిల్లు తాజ్ పురియా హత్య ఉదంతంతో ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు అధికారులు. జైలులోనే టిల్లును హత్య చేసిన మరో గ్యాంగ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ల రెక్కలను ఆయుధంగా ఉపయోగించి హత్య చేశారు. దీంతో ఎగ్జాస్ట్ ఫ్యాన్ల స్థానంలో ప్లాస్టిక్ ఫ్యాన్లు అమర్చాలని..జైలు ప్రాంతంలో ఎల్ఈడీ లైట్లు రాత్రి అంతా వెలిగేలా ఉండాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంతో తీహార్ జైలులోని గదుల్లో 2000 ఎగ్జాస్ట్ ఫ్యాన్లు ఏర్పాటు చేయనున్నారు.

Tihar jail Gangster Tillu incident : జైలుల్లోకి కత్తులు ఎలా వచ్చాయి? టిల్లుని హత్య చేస్తుంటే మీరేం చేస్తున్నారు : ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం

మే 2 (2023)న జైలు గదిలో తాజ్‌పురియా దారుణ హత్యకు గురయ్యాడు. ఆయన హత్యకు జైలులోని ప్రమాదకరమైన వస్తువులను ఉపయోగించారని ఢిల్లీ జైళ్ల శాఖ డీజీ సంజయ్ బిస్వాల్ తెలిపారు. ఈ క్రమంలో ఆయుధాలుగా ఉపయోగించేందుకు అనువుగా ఉండే ప్రమాదకర వస్తువుల స్థానంలో ప్లాస్టిక్ వస్తువులను అమర్చనున్నామని తెలిపారు. టిల్లు హత్య తరువాత ఇటువంటి ఘటనలు మరోసారి జరుగకుండా ఉండేందుకు ఖైదీల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఇటువంటి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. దీంట్లో భాగంగానే తీహార్ జైల్లోని ఖైదీల బ్యారక్ లలోని వార్డు నుంచి 2000కు పైనే ఉన్న ఎగ్జాస్ట్ ఫ్యాన్లను తొలగించారు అధికారులు.

కాగా అత్యంత పటిష్ట భద్రత ఉండే తీహార్ జైల్లో తాజ్ పురియాను ప్రతిర్థి గ్యాంగ్ యోగేష్ గ్యాంగ్ లోని నలుగురు వ్యక్తులు దీపక్ అలియాస్ టిటార్, యోగేష్ అలియాస్ తుండా, రాజేష్, రియాస్ ఖాను న్లు టిల్లును 92 సార్లు పొడిచి చంపారు. జైలు మొదటి అంతస్థులో ఉండే గోగి గ్యాంగ్ వారి గదికి ఉండే ఎగ్జాస్ట్ ఫ్యాన్ తొలగించి దానినే మారణాయుధంగా తయారు చేసిన వారి సెల్ లోని ఇనుప గ్రిల్ ను కత్తిరించి బెడ్ షీట్ల సహాయంతో దిగి టిట్లును అత్యంత దారుణంగా చంపారు. ఈ హత్య పెను సంచలనంగా మారింది.

Tihar Jail : తీహార్ జైల్లో రోహిణి కోర్టు కాల్పుల నిందితుడు టిల్లు తాజ్ పురియా హత్య

కాగా టిల్లును హత్య చేస్తుండగా పలువురు పోలీసులు అక్కడే ఉన్నా యోగేష్ గ్యాంగ్ ను ఏమాత్రం అడ్డుకోలేదు. వేడుక చూస్తు నిలబడ్డారు. ఇదంతా సీసీ టీవీ ఫుటేజ్ లో రికార్డు అయ్యింది. కాగా జైలులో జరిగిన ఈ హత్యపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇంత పటిష్ట భద్రత ఉన్న జైల్లోకి కత్తులు ఎలా వచ్చాయి? టిల్లుని హత్య చేస్తుంటే మీరేం చేస్తున్నారు ప్రశ్నించింది. భద్రత విషయం విఫలమయ్యారు అంటూ ఆగ్రహం వ్యక్తంచేసింది.