ప్రధాని కమాండర్…ప్రజలు సిపాయిలు : లాక్ డౌన్ కు చిదంబరం మద్దతు

  • Published By: venkaiahnaidu ,Published On : March 25, 2020 / 12:59 PM IST
ప్రధాని కమాండర్…ప్రజలు సిపాయిలు : లాక్ డౌన్ కు చిదంబరం మద్దతు

Updated On : March 25, 2020 / 12:59 PM IST

కరోనాపై పోరాటంలో భాగంగా 21రోజులు దేశవ్యాప్త లాక్ డౌన్ కు పిలుపునిచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోడీకి,కేంద్రానికి,రాష్ట్ర ప్రభుత్వాలకు మద్దుతు తెలపడం మనందరి బాధ్యత అని కాంగ్రెస్ నాయకుడు,మాజీ కేంద్రమంత్రి చిదంబరం అన్నారు. మోడీ పిలుపునిచ్చిన లాక్ డౌన్ ను “వాటర్ షెడ్ మూమెంట్”గా చిదంబరం అభివర్ణించారు. ప్రధానమంత్రి మోడీ కమాండర్ అని,ప్రజలందరూ సిపాయిలు అని చిదంబరం అన్నారు.

లాక్ డౌన్ డీల్ చేయడానికి పేదలకు సహాయం చేయడానికి 10పాయింట్ల రెస్ఫాన్స్ ఫ్లాన్ ను సూచించారు చిదంబరం. పేదల అకౌంట్లలో డబ్బులు వేయాలని, అన్ని ముఖ్యమైన సరుకులు,సర్వీసులకు ఏప్రిల్-1,2020 నుంచి మూడు నెలల ట్యాక్స్ కట్ చేయాలని చిదంబరం సూచించారు. మార్చి-24 ముందు జరిగినట్లుగా మనం డిబేట్ల వెనుక ఉండాలని చిదంబరం అన్నారు. 

కౌలు రైతులకు కూడా కలిపి పీఎం-కిసాన్ స్కీమ్ కింద రైతులకు ఇచ్చే 12వేల రూపాయలను రెట్టింపు చేయాలని చిదంబరం కోరారు. రూరల్ ఎంప్లాయిమెంట్ ప్రోగ్రాం MGNREGA కింద రిజిస్టర్డ్ వర్కర్స్ బ్యాంక్ అకౌంట్లకు రూ.3,000 ట్రాన్స్ ఫర్ చేయాలని చిదంబరం సూచించారు. పట్టణ ప్రాంతాల పేద ప్రజల కొరకు…రాబోయే 21రోజుల్లో 10కిలోల రైస్ లేదా గోధుమలు కూడా పూర్తి ఉచితంగా ఇవ్వడంతో పాటుగా, వారి జన్ ధన్ అకౌంట్లలో 6వేల రూపాయలు జమ చేయాలని చిదంబంరం సూచించారు.

అన్ని రిజిస్టర్డ్ ఎంప్లాయర్స్(ఉద్యోగాలు ఇచ్చేవాళ్లు)ప్రస్తుత ఎంప్లాయిమెంట్ మరియు వేతనాల స్థాయిని మెయింటెన్ చేయాలని చిదంబరం తెలిపారు. ఏదైనా కేటగిరీల కింద పేమెంట్ అందనవాళ్లకోసం ప్రతీ వార్డు లేదా బ్లాక్ లో ఓ రిజిస్టర్ ఓపెన్ చేయాలని చిదంబరం అన్నారు. కనీస వెరిఫికేషన్ తర్వాత ప్రతి ఒక్క పేరుతో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి(ఇప్పటికీ ఒకటి లేకుంటే)దానిని ఆధార్ తో లింక్ చేసి,3వేల రూపాయలు నగదును వాళ్ల అకౌంట్లలోకి ట్రాన్స్ ఫర్ చేయాలని చిదంబరం సూచించారు.