మోడీ రైతు బంధు : తొలి విడత రూ.2వేలకు ఆధార్ అక్కర్లేదు

ప్రధాన మంత్రి కిసాన్ పథకం కింద లబ్ధి పొందనున్న రైతులకు ఆధార్ తప్పనిసరి కాదట. మరి కొంతకాలంలో జరగనున్న సాధారణ ఎన్నికలను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం రైతులకు రూ. 75వేల కోట్లను విడుదల చేసింది. ఏటా రూ.6వేలు చేరనుండటంతో దానిలో మొదటి విడతగా తీసుకోనున్న రూ.2వేలకు ఆధార్ తప్పనిసరి కాదంటూ రైతులకు ఊరట కలిగించారు.
ఏడాదికి మూడు విడతలుగా రానున్న బడ్జెట్‌లో డిసెంబర్ 2018-మార్జి 2019కు మొదటి సారి రూ.2వేలు అందివ్వనున్నారు. అయితే ఆధార్ కార్డు అందుబాటులో లేకపోతే దానికి బదులుగా డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు కార్డు, ఎఆర్ఈజీఏ జాబ్ కార్డు, కేంద్ర రాష్ట్రాల గుర్తింపు కార్డు ఏది ఉన్నా సరిపోతుందంటూ నియామలను సడలించారు.
ఈ పథకానికి అర్హుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తుంది. ఈ క్రమంలోనే అర్హత కలిగిన పేద, మధ్య తరగతి రైతులు తమ గుర్తింపు కార్డులతో నమోదు చేయించుకోవాలి. 2019 ఫిబ్రవరి 1 నాటికి ఎవరైతే పంట పొలాలకు యజమానిగా ఉన్నారో వారికే ఈ పథకం వర్తిస్తుంది. ఒకవేళ ఆధార్ లేకపోయినా ఏదైనా గుర్తింపు కార్డుతో సంప్రదిస్తే సరిపోతుంది.