PM Modi : 2022ని “ఆసియన్-ఇండియా ఫ్రెండ్‌షిప్ ఇయర్”గా జరుపుకుంటాం

18వ ఇండియా-ఏషియన్ శిఖరాగ్ర సదస్సులో ఇవాళ ప్రధాని మోదీ వర్చువల్ గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. 2022తో ఇండియా-ఏషియన్ భాగస్వామ్యం 30 ఏళ్లు పూర్తి చేసుకుంటుందన్నారు.

PM Modi : 2022ని “ఆసియన్-ఇండియా ఫ్రెండ్‌షిప్ ఇయర్”గా జరుపుకుంటాం

Frd

Updated On : October 28, 2021 / 4:59 PM IST

PM Modi 18వ ఇండియా-ఏషియన్ శిఖరాగ్ర సదస్సులో ఇవాళ ప్రధాని మోదీ వర్చువల్ గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. 2022తో ఇండియా-ఆసియన్ భాగస్వామ్యం 30 ఏళ్లు పూర్తి చేసుకుంటుందన్నారు. అప్పటికి భారత్‌‌ కు స్వాతంత్ర్యం లభించి 75 ఏళ్లు పూర్తవుతుందని..భారత్ ఈ మైలురాయిని చేరుకోనున్న నేపథ్యంలో 2022ను “ఆసియన్-ఇండియా ఫ్రెండ్‌షిప్ ఇయర్”గా భారత్ జరుపుకుంటదని మోదీ తెలిపారు.

ఆసియన్​ దేశాలతో స్నేహమే భారత్​కు ప్రధానం అని మోదీ స్పష్టం చేశారు. భారత్ ఇటీవల ఎదుర్కొన్న ప్రధాన సంక్షోభాల్లో ప్రధానమైన కోవిడ్-19 మహమ్మారి గురించి మోదీ ప్రస్తావిస్తూ.. కోవిడ్-19 వల్ల మనందరం ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నామని, కొవిడ్​ ప్రభావం ఆసియన్​ దేశాలు-భారత్​ మధ్య స్నేహానికి సవాల్​గా మారిందన్నారు. ఈ సమయంలో పరస్పర సహకారంతోనే బంధం బలోపేతం చేయగలమని పేర్కొన్నారు.

పరస్పర సహకారంతోనే ఆసియన్​ దేశాలు-భారత్​ మధ్య బంధం బలోపేతం అవుతుందన్నారు మోదీ. ఆసియన్ దేశాలతో భారత్ బంధం వేల ఏళ్ల నాటిదని, ఈ సత్సంబంధాలు మన విలువలు, ఆచారాలు, భాషలు, సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లను ప్రతిబింబిస్తున్నాయని చెప్పారు. ఆసియన్ దేశాలతో పెట్టుబడులు, వాణిజ్యం, భద్రత, రక్షణ రంగాల్లో సహకారాన్ని పెంపొందించడంపై ఈ సదస్సు వేదికగా భారత్​ దృష్టిసారించింది. ఇక. గతేడాది కూడా వర్చువల్‌గా 17వ ఆసియన్-ఇండియా సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించిన విషయం తెలిసిందే.

ALSO READ Instagram Model Photoshoot : తండ్రి శవం పక్కనే కూతురు ఫొటోషూట్..ఇన్​స్టాగ్రామ్​ మోడల్ పై నెటిజన్లు ఫైర్