ఎన్సీపీ, బీజేడీలపై పొగడ్తలు కురిపించిన మోడీ
పార్లమెంట్ నిబంధనలకు ఈ పార్టీలు కట్టుబడిన తీరు అద్భుతంగా ఉంది. చర్చల సమయంలో సమర్థవంతమైన అంశాలను లేవనెత్తుతారు. వెల్‌లోకి దూసుకెళ్లనప్పటికీ..

పార్లమెంట్ నిబంధనలకు ఈ పార్టీలు కట్టుబడిన తీరు అద్భుతంగా ఉంది. చర్చల సమయంలో సమర్థవంతమైన అంశాలను లేవనెత్తుతారు. వెల్‌లోకి దూసుకెళ్లనప్పటికీ..
రాజ్యసభ 250వ సమావేశంలో భాగంగా మాట్లాడిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ), బిజు జనతాదళ్ (బీజేడీ)లపై ప్రశంసలు కురిపించారు. ప్రజల హృదయాలను గెలుచుకున్నాయని, వారి నుంచి తమ బీజేపీతో పాటు ఇతర పార్టీలు కూడా ఎన్సీపీ, బీజేడీల నుంచి నేర్చుకోవాలని పొగిడేశారు.
ఎన్సీపీ, బీజేడీ ఒక్కసారి కూడా వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళన చేయలేదు. పార్లమెంట్ నిబంధనలకు ఈ పార్టీలు కట్టుబడిన తీరు అద్భుతంగా ఉంది. చర్చల సమయంలో సమర్థవంతమైన అంశాలను లేవనెత్తుతారు. వెల్‌లోకి దూసుకెళ్లనప్పటికీ ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. భాజపా సహా ఇతర పార్టీల నేతలంతా ఎంతో నేర్చుకోవాల్సి ఉందని మోడీ వెల్లడించారు.
ఓ వైపు మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు, మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో శరద్ పవార్ భేటీ జరగనున్న సమయంలో ప్రధాని మోడీ పవార్ జాతీయ కాంగ్రెస్ పార్టీపై ప్రశంసలు కురిపించడం ఆసక్తికరంగా మారింది. బిజు జనతా దళ్ కూడా పలు సందర్భాల్లో ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి మధ్య తటస్థంగా నిలిచిన సందర్భాలు ఉన్నాయి.