NDA Meet: ఎన్డీయే సమావేశం కోసం అశోక హోటల్ కు చేరుకున్న ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్రమోదీకి హిందుస్తాన్ ఆవామ్ మోర్చా అధినేత జితన్ రాం మాంఝీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఏఐడీఎంకే చీఫ్ ఎడప్పాడి పళనిస్వామి స్వాగతం పలికారు

Delhi: భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగే నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ సమావేశానికి హాజరయ్యేందుకు ఢిల్లీలోని అశోక హోటల్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేరుకున్నారు. ఆయనకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హిందుస్తాన్ ఆవామ్ మోర్చా అధినేత జితన్ రాం మాంఝీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఏఐడీఎంకే చీఫ్ ఎడప్పాడి పళనిస్వామి స్వాగతం పలికారు. ఇప్పటికే ఎన్డీయేలోని 38 పార్టీలు హోటల్ చేరుకున్నాయి. నరేంద్రమోదీ రాకతో సమావేశం ప్రారంభం కానుంది.
ఎన్డీయేలోని 24 పార్టీలు.. భారతీయ జనతా పార్టీ (BJP), అన్నాడీఎంకే, శివసేన (ఏకనాథ్ షిండే వర్గం), నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP), నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (NDPP), సిక్కిం క్రాంతికారి మోర్చా (SKM), జన్నాయక్ జనతా పార్టీ (JJP), భారతీయ మక్కల్ కల్వి మున్నేట్ర కజ్గం (IMKMK), ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (AJSU), రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా (RPI), మిజో నేషనల్ ఫ్రంట్ (MNF), తమిళ మనీలా కాంగ్రెస్ (TMC), IPFT (త్రిపుర), బోడో పీపుల్స్ పార్టీ (BPP), పాటాలి మక్కల్ కచ్చి (PMK), మహాస్త్రవాది గోమంతక్ పార్టీ (MGP), అప్నా దళ్, అస్సాం గణ పరిషత్ (AGP), రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ (RLJP), నిషాద్ పార్టీ, యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ (UPPL), ఆల్ ఇండియా NR కాంగ్రెస్ పుదుచ్చేరి (AIRNC), శిరోమణి అకాలీదళ్ సాయుంక్త్ (ధింధ్‌సౌక్త్), జనసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్ వర్గం), లోక్ జన్ శక్తి పార్టీ (రామ్ విలాస్), హిందూస్థానీ అవామ్ మోర్చా (HAM), రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (RLSP), వికాశీల్ ఇన్సాన్ పార్టీ (VIP), సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ-ఓం ప్రకాష్ రాజ్‌భర్ (SBSP) పార్టీలు ఎన్డీయే సమావేశంలో పాల్గొననున్నాయి.