PM Modi Dials Mamata : దీదీకి మోదీ ఫోన్

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ పశ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీకి ఫోన్ చేశారు.

PM Modi Dials Mamata : దీదీకి మోదీ ఫోన్

Updated On : August 4, 2021 / 4:47 PM IST

PM Modi Dials Mamata Banerjee:ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ పశ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీకి ఫోన్ చేశారు. బెంగాల్​ లో వరదల పరిస్థితి గురించి మమతని అడిగి తెలుసుకున్నారు. బెంగాల్‌ లో వివిధ డ్యామ్‌ల నుంచి భారీగా విడుద‌ల అవుతున్న నీటి వ‌ల్ల కొన్ని లోత‌ట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. వరదల వల్ల కలిగిన నష్టాన్ని ఎదుర్కోనేందుకు.. కేంద్ర నుంచి సంపూర్ణ సహాయసహకారాలు అందిస్తామని మమతకి మోదీ హామీ ఇచ్చారని ప్రధాని కార్యాలయం తెలిపింది. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు త్వరగా కోలుకోవాలని మోదీ ఆకాంక్షించినట్లు పీఎంవో తెలిపింది. వరదల పరిస్థితిపై కేంద్రానికి నివేదికను అందజేస్తామని మోదీతో దీది చెప్పినట్లు ఓ అధికారి తెలిపారు.

మరోవైపు,హావ్​డా జిల్లాలోని ఉదయ్​నారాయణ్​పుర్​లో వరద ప్రభావిత ప్రాంతాలను ఇవాళ మమత సందర్శించారు. కాగా, భారీ వర్షాల కారణంగా దామోదర్​ లోయ ప్రాంతంలోని ఆనకట్టల నుంచి పోటెత్తిన వరదల కారణంగా ఆరు జిల్లాలకు చెందిన 3 లక్షల మంది నిరాశ్రయులు అయ్యారు. వరదల ధాటికి 15 మంది ప్రాణాలు కోల్పోయారు.