Uttarkashi Tunnel Operation : సమిష్టి కృషికి అద్భుతమైన ఉదాహరణ- టన్నెల్ ఆపరేషన్ సక్సెస్‌పై ప్రధాని మోదీ హర్షం

కార్మికులు సురక్షితంగా బయటకు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. రెస్క్యూ ఆపరేషన్‌ లో పాల్గొన్న వారిని అభినందించారు.

Uttarkashi Tunnel Operation : సమిష్టి కృషికి అద్భుతమైన ఉదాహరణ- టన్నెల్ ఆపరేషన్ సక్సెస్‌పై ప్రధాని మోదీ హర్షం

PM Modi Reaction On Tunnel Operation Success

Updated On : November 28, 2023 / 10:47 PM IST

ఉత్తరాఖండ్ లోని సిల్క్ యారా టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ విజయవంతం కావడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఉత్తరకాశీలో కార్మిక సోదరుల రెస్క్యూ ఆపరేషన్ విజయవంతం కావడం అందరినీ భావోద్వేగానికి గురి చేసిందన్నారు. సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికుల ధైర్యం, సహనం అందరికీ స్ఫూర్తిదాయకం అన్నారు ప్రధాని మోదీ.

కార్మికులంతా ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్‌ లో పాల్గొన్న వారిని అభినందించారు ప్రధాని మోదీ. రెస్క్యూ టీమ్స్ ధైర్యం, సంకల్పం మన కార్మిక సోదరులకు కొత్త జీవితాన్ని ప్రసాదించాయన్నారు. ఈ మిషన్‌ లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ మానవత్వం, సమిష్టి కృషికి అద్భుతమైన ఉదాహరణగా నిలిచారని ప్రధాని మోదీ ప్రశంసించారు.

Also Read : ఉత్తరకాశీ టన్నెల్ ఆపరేషన్ సక్సెస్.. 17 రోజుల తర్వాత బయటికి వచ్చిన కార్మికులు

టన్నెల్ ఆపరేషన్ సక్సెస్ గురించి తెలియగానే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రికి ప్రధాని మోదీ ఫోన్ చేశారు. రెస్క్యూ ఆపరేషన్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్మికులు సురక్షితంగా బయటకు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ప్రధాని మోదీ.

ఈ నెల 12న కార్మికులు సొరంగంలో చిక్కుకుపోయారు. మొత్తం 41 మంది కూలీలు అందులో ఉండిపోయారు. వారిని బయటకు తీసుకొచ్చేందుకు చేపట్టిన టన్నెల్ ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. కూలీలు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. బయటకు వచ్చిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఇందుకోసం సొరంగం దగ్గర 41 అంబులెన్స్ లు, హెలికాప్టర్లు సిద్ధంగా ఉంచారు. వారిని తరలించేందుకు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు.

Also Read : సొరంగం నుంచి బయటికి 41మంది కూలీలు.. రెస్క్యూ ఆపరేషన్ గురించి 10 కీలక అంశాలు