Uttarkashi Tunnel Rescue: ఉత్తరకాశీ టన్నెల్ ఆపరేషన్ సక్సెస్.. 17 రోజుల తర్వాత బయటికి వచ్చిన కార్మికులు

17 రోజుల అనంతరం కార్మికులు బయటికి వచ్చారు. సొరంగంలో ఇరుక్కున్న 41 మంది కార్మికులు క్షేమంగా బయటికి వచ్చారు.

Uttarkashi Tunnel Rescue: ఉత్తరకాశీ టన్నెల్ ఆపరేషన్ సక్సెస్.. 17 రోజుల తర్వాత బయటికి వచ్చిన కార్మికులు

Updated On : November 28, 2023 / 9:02 PM IST

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు నిర్వహించిన ఆపరేషన్ విజయవంతం అయింది. దీంతో 17 రోజుల అనంతరం కార్మికులు బయటికి వచ్చారు. సొరంగంలో ఇరుక్కున్న 41 మంది కార్మికులు క్షేమంగా బయటికి వచ్చారు.

కాగా, దీనిపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి హర్షం వ్యక్తం చేశారు. తన ఎక్స్ ఖాతా ద్వారా ఆయన స్పందిస్తూ.. టన్నెల్‌లో నిర్మించిన తాత్కాలిక వైద్య శిబిరంలో కార్మికులందరికీ ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. బయటికి వచ్చిన కార్మికులను ఓదారుస్తున్న ఫొటోలను ఆయన షేర్ చేశారు.