Uttarakhand : యోగి ఆదిత్యనాథ్ సోదరిని కలిసిన మోడీ సోదరి.. ఇద్దరి సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా
ఒకరు దేశ ప్రధాని సోదరి.. మరొకరు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి సోదరి.. ఇద్దరు ఓ ఆలయం వద్ద కలిసారు. ఆప్యాయంగా పలకరించుకున్నారు. వారు ఒకరినొకరు పలకరించుకున్న విధానం, సింప్లిసిటీ నెటిజన్ల మనసు దోచుకుంది.

Uttarakhand
Uttarakhand : ఒకరు భారత ప్రధాని మోడీ చెల్లెలు.. మరొకరు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెల్లెలు.. ఇద్దరు కలిసారు. ఒకరినొకరు ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. వీరి కలయికకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
Uttarakhand : స్త్రీలు ఒంటిపై 80% కప్పుకుంటేనే ఉత్తరాఖండ్ ఆలయాల్లోకి అనుమతి ఇస్తారట
ప్రధాని మోడీ సోదరి వాసంతీబెన్ శివుడికి ప్రార్థనలు చేసేందుకు పౌరీ గర్వాల్‌లోని నీలకంఠ మహదేవ్ ఆలయానికి తన భర్తతో కలిసి వెళ్లారు. కొఠారీ గ్రామంలోని పార్వతి ఆలయాన్ని సందర్శించిన ఆమె అక్కడ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోదరి శశిదేవ్‌ను కలిశారు. ఇద్దరు ఒకరినొకరు ఆప్యాయంగా కౌగిలించుకుని పలకరించుకున్నారు. చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. ఆ తరువాత ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహించారు. వారి సోదరులు ప్రముఖ పదవుల్లో ఉన్నా ఆ ఇద్దరు చెల్లెళ్లలు సాధారణంగా కనిపించారు. వారి సింప్లిసిటీ నెటిజన్ల మనుసును దోచుకుంది.
Women Height Increased: మోదీ ప్రభుత్వంలో జరిగిన అద్భుతం.. మహిళలు ఎత్తు పెరుగుతున్నారట!
బీజేపీ నేత అజయ్ నందా తన ట్విట్టర్ ఖాతాలో (@ajay_mlnanda) ఈ వీడియోను షేర్ చేశారు. ‘ప్రధాని మోడీ సోదరి బసంతిబెన్ , సిఎం యోగి సోదరి శశిల కలయిక భారతీయ సంస్కృతి, సంప్రదాయాల కలయికగా కనిపిస్తోంది. వారి బంధం రాజకీయాలకు అతీతంగా ఉండటం మాకు గర్వకారణంగా అనిపిస్తోంది’ అనే శీర్షికతో ఆయన షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. సాధారణమైన జీవితం గడుపుతున్న ఇద్దరు గొప్ప వ్యక్తులను ఇలా చూడటం సంతోషంగా ఉందని నెటిజన్లు కామెంట్లు పెట్టారు.
PM Modi’s sister Basantiben and CM Yogi’s sister Shashi meeting exemplifies the essence of simplicity, Indian culture, and tradition. It’s heartening to witness their bond, transcending politics, and making us proud of these two remarkable individuals representing India’s values.… pic.twitter.com/CCYLKkvqVb
— Advocate Ajay Nanda (@ajay_mlnanda) August 4, 2023