నివర్ తుఫాను బాధితులకు ప్రధాని సాయం

  • Published By: venkaiahnaidu ,Published On : November 28, 2020 / 03:11 AM IST
నివర్ తుఫాను బాధితులకు ప్రధాని సాయం

Updated On : November 28, 2020 / 7:25 AM IST

PM Modi announces relief నివర్​ తుఫాను తమిళనాడును అతలాకుతలం చేసింది. భారీ వర్షాలు, భీకర గాలుల మధ్య తుఫాను గురువారం తీరం దాటింది.



ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామితో ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్​లో సంభాషించారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై ఆరా తీశారు. నివర్ తుఫాను బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఇప్పటివరకూ తమిళనాడులో తుఫాన్ కారణంగా నలుగురు చనిపోయినట్లు సీఎం పళనిస్వామి ప్రధాని మోడీకి తెలిపారు.చాలాచోట్ల వృక్షాలు నేలకొరిగినట్లు చెప్పారు.పెద్ద సంఖ్యలో పశువులు మేకలు మృత్యువాత పడినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2.3 లక్షల మందిని పునరావాస శిబిరాలకు తరలించినట్లు పేర్కొన్నారు.



తుఫాను కారణంగా మరణించిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి సహాయ నిధి కింద రూ. 2లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు మోడీ. గాయపడిన ఒక్కొక్కరికి రూ. 50వేల చొప్పున అందిస్తామన్నారు. ఈ మేరకు ప్రధాని మోడీ తన ట్విట్టర్​ ఖాతాలో వెల్లడించారు.



కాగా, దక్షిణ భారతదేశంలోని తమిళనాడు, పుదుచ్చేరితో పాటు ఆంధ్రప్రదేశ్‌, కర్నాటకలోని పలు ప్రాంతాల్లో నివర్‌ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా.. తర్వాత తీవ్ర తుఫానుగా మారింది. బుధవారం అర్ధరాత్రి తీరం దాటింది. దీని ప్రభావంతో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.



గంటకు 100-120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. భారీగా వీస్తున్న గాలులకు చెన్నైలో సుమారు 80 చెట్లు నేలకూలాయి. ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. భారీగా వీస్తున్న గాలులకు చెన్నైలో సుమారు 80 చెట్లు నేలకూలాయి. ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి.

భారీ వర్షాల నేపథ్యంలో ముందసు జాగ్రత్తగా తమిళనాడు ప్రభుత్వం 1.45 లక్షల మందిని సహాయ శిబిరాలకు తరలించింది. తుఫాను నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 1,516 సహాయ శిబిరాలు ఏర్పాటు చేసినట్లు తమిళనాడు విపత్తు నిర్వహణ మంత్రి ఆర్‌బీ ఉదయకుమార్ తెలిపారు.