PM Modi : సామాన్యుడిలా మోదీ, సైనికులతో దీపావళి సంబరాలు

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సామాన్యుడిలా మారిపోయారు. కొద్దిసేపు ప్రోటోకాల్ పక్కన పెట్టారు. సామాన్యుడిలా కారు తీశారు.

PM Modi : సామాన్యుడిలా మోదీ, సైనికులతో దీపావళి సంబరాలు

Modi

Updated On : November 5, 2021 / 9:41 AM IST

Modi celebrates Diwali : ప్రధాన మంత్రి వెళుతున్నారంటే..కాన్వాయ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆయన వెళుతున్న మార్గంలో కొద్దిసేపు ట్రాఫిక్ ను నిలిపివేస్తారు. అయిన..వెళ్లిన అనంతరం ట్రాఫిక్ ఓకే చెబుతుంటారు.  ఆయన కాన్వాయ్ ప్రయాణం వేరుగా ఉంటుంది. అయితే… భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సామాన్యుడిలా మారిపోయారు. కొద్దిసేపు ప్రోటోకాల్ పక్కన పెట్టారు. సామాన్యుడిలా కారు తీశారు. రోడ్డెక్కిన మోదీ కారు..రోడ్డుపై ప్రయాణించింది. అందరిలాగే..ఆయన ప్రయాణం సాగింది. ఆయన వెళుతున్న మార్గంలో..రెడ్ సిగ్నల్ పడడంతో అందరిలాగానే ఆగిపోయారు. గ్రీన్ సిగ్నల్ పడిన అనంతరం ఆయన కారు బయలుదేరింది. సైనికులతో దీపావళి పండుగ సంబరాలు జరుపుకొనేందుకు ఆయన కశ్మీర్ కు వెళ్లిన సంగతి తెలిసిందే.

Read More : Diwali Lamps : దీపావళి రోజు దీపాలు ఎక్కడెక్కడ వెలిగించాలంటే?…

నౌషెరా సెక్టార్ లో పండుగ చేసుకున్నారు. సైనికుల అమరువీరుల స్తూపం దగ్గర నివాళి అర్పించారు. అనంతరం సైనికులతో మాట్లాడారు. వారికి స్వీట్లు తినిపించారు. వారితో కలిసి ఫొటోలు దిగారు. జమ్మూలో ఉన్నతాధికారులు, ఇతర జవాన్లను ఆయన కలుసుకున్నారు. ఈ సందర్భంగా సైనికులను ప్రశంసలతో ముంచెత్తారు. దేశం కోసం పహారా కాస్తున్న సైనికులను ఆయన అభినందించారు. తాను ప్రధానిగా ఇక్కడకు రాలేదని..ఓ కుటుంబసభ్యుడిగా వచ్చానని సైనికులతో తెలిపారు. సైన్యం సేవలు చూసి దేశం గర్విస్తోందన్నారు మోదీ. రాజౌరి జిల్లా నౌషెరా సరిహద్దు నియంత్రణ రేఖ వద్దకు వచ్చారు. అంతకంటే ముందు…ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో జమ్మూ చేరుకున్నారు. 2014లో ప్రధాన మంత్రి అయిన నరేంద్ర మోదీ…ప్రతి దీపావళి పండుగను సరిహధ్దులోని సైనికులతో జరుపుకుంటున్నారు. 2019లో కూడా రాజౌరీలో సైనికులతో కలిసి దీపావళి సంబరాలు జరుపుకున్నారు.