Tripura Government Formation: మార్చి 8న త్రిపురకు ప్రధాని నరేంద్ర మోదీ

మార్చి 8న త్రిపురలో కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గోనున్నారు.

Tripura Government Formation: మార్చి 8న త్రిపురకు ప్రధాని నరేంద్ర మోదీ

PM MODI

Updated On : March 4, 2023 / 3:08 PM IST

Tripura Government Formation: గత నెలలో త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ జరగగా.. ఈనెల 2న ఫలితాలు వెలవడ్డాయి. రెండు రాష్ట్రాల్లో బీజేపీ హవా కొనసాగి అధికార పీఠాన్ని అదిరోహించనుంది. ముఖ్యంగా త్రిపుర రాష్ట్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది. త్రిపురలో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. బీజేపీకి 32 స్థానాలు వచ్చాయి. దాని మిత్రపక్షమైన ఐపీఎఫ్‌టీ ఒక స్థానం గెలుచుకుంది.

PM Modi Brother Prahlad Modi: ప్రధాని మోదీ సోదరుడికి అస్వస్థత.. చెన్నైలోని ఆస్పత్రిలో వైద్య చికిత్సలు

త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా శుక్రవారం తన ప్రభుత్వ రాజీనామాను గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ఆర్యకు సమర్పించారు. త్రిపురలో మార్చి 8న కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు మాణిక్ సాహా తెలిపారు. కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవం వివేకానంద మైదాన్‌లో జరుగుతుంది. తాజాగా, త్రిపురలో ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించి ముఖ్య కార్యదర్శి ఎస్‌కే సిన్హా సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. శనివారం ఎస్పీజీ బృందం‌కూడా త్రిపురకు చేరుకొనే అవకాశం ఉంది.

త్రిపురలో బీజేపీ ప్రభుత్వం మరోసారి అధికార బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో ఎన్ఈడీఏ చైర్మన్ గా ఉన్న అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వాశర్మ శనివారం త్రిపురకు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంకు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలను కూడా ఆహ్వానిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేబాటి త్రిపుర తెలిపారు. అయితే, కొత్తగా ఎన్నికైన పార్టీ సభ్యుల సమావేశం ఇంకా ఖరారు కాలేదని, బహుశా సోమవారం ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాబెందు భట్టాచార్జీ తెలిపారు.