Ram Setu: అలా అయితే 2024లో మోదీ ఓడటం ఖాయం: బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి

రామసేతును వారతస్వ కట్టడంగా గుర్తించే పటిషన్‭పై విచారణను ఈరోజు సుప్రీంకోర్టు తుది దశకు తీసుకుంది. అలాగే ఇది నిజమో అబద్ధమో చెప్తూ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఒకవేళ నిజం అయితే నేను విజయం సాధిస్తాను. అబద్ధం అయితే 2024లో నరేంద్రమోదీ ఓడిపోతారు. నేను ఈ పిటిషన్ వేయడానికి సత్య సభర్వాల్ తన అద్భుతమైన పరిశోధన ద్వారా నాకు ఈ డ్రాఫ్ట్ అందించారు

Ram Setu: అలా అయితే 2024లో మోదీ ఓడటం ఖాయం: బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి

PM Modi will lose in 2024 if he does not file affidavit in Ram Setu case says Swamy

Updated On : August 22, 2022 / 7:24 PM IST

Ram Setu: రామసేతుపై ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయకపోతే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఓడిపోవడం ఖాయమని భారతీయ జనతా పార్టీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి జోస్యం చెప్పారు. కొంత కాలంగా వరుస విమర్శలతో మోదీపై విరుచుకుపడుతున్న స్వామి.. తాజాగా రామ సేతు వివాదాన్ని తెరపైకి తీసుకురావడం గమనార్హం. ఒక పరిశీలకుడు ఇచ్చిన డ్రాఫ్ట్ ఆధారంగా సుప్రీంకోర్టును సుబ్రహ్మణ్య స్వామి ఆశ్రయించినట్లు ఆయన చెప్పుకొచ్చారు.

తాజాగా సుప్రీం కోర్టును ఈ కేసును ఫైనల్ చేసే పనిలో ఉందని స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపిన సుబ్రహ్మణ్య స్వామి.. మోదీ ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. ‘‘రామసేతును వారతస్వ కట్టడంగా గుర్తించే పటిషన్‭పై విచారణను ఈరోజు సుప్రీంకోర్టు తుది దశకు తీసుకుంది. అలాగే ఇది నిజమో అబద్ధమో చెప్తూ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఒకవేళ నిజం అయితే నేను విజయం సాధిస్తాను. అబద్ధం అయితే 2024లో నరేంద్రమోదీ ఓడిపోతారు. నేను ఈ పిటిషన్ వేయడానికి సత్య సభర్వాల్ తన అద్భుతమైన పరిశోధన ద్వారా నాకు ఈ డ్రాఫ్ట్ అందించారు’’ అని సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్ చేశారు.

Krushna Rout: పార్టీకి పిలిచి.. బాగా తాగిపించి.. రహస్య ప్రదేశంలో స్టీల్ గ్లాస్ చొప్పించిన స్నేహితులు