Narendra Modi : నరేంద్ర మోదీనే హ్యాట్రిక్ ప్రధానమంత్రి.. యూకే ప్రముఖ దినపత్రిక సంచలన కథనం

భారతదేశంలో ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ హ్యాట్రిక్ విజయం సాధిస్తారా? అంటే అవునంటోంది యూకే ఆధారిత ది గార్డియన్ దినపత్రిక. భారతదేశంలో త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో మూడోసారి నరేంద్రమోదీ ప్రధానమంత్రి కావడం అనివార్యమని ది గార్డియన్ పత్రిక కథనం రాసింది.....

Narendra Modi : నరేంద్ర మోదీనే హ్యాట్రిక్ ప్రధానమంత్రి.. యూకే ప్రముఖ దినపత్రిక సంచలన కథనం

PM Modi

Updated On : January 1, 2024 / 12:32 PM IST

Prime Minister Narendra Modi : భారతదేశంలో ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ హ్యాట్రిక్ విజయం సాధిస్తారా? అంటే అవునంటోంది యూకే ఆధారిత ది గార్డియన్ దినపత్రిక. భారతదేశంలో త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో మూడోసారి నరేంద్రమోదీ ప్రధానమంత్రి కావడం అనివార్యమని ది గార్డియన్ పత్రిక కథనం రాసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ సాధించిన విజయాలు, అపార ప్రజాదరణ, అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం వంటి అంశాలు మోదీని మూడోసారి ముఖ్యమంత్రిని చేస్తాయని యూకే పత్రిక తెలిపింది.

ALSO READ : Prime Minister Mody : 2023 సంవత్సరంలో ప్రధాని మోదీ మర్చిపోలేని మధుర చిత్రాలు 

మూడు రాష్ట్రాల విజయంతో బీజేపీకి మరింత బలం పెరిగిందని హన్నా ఎల్లిస్-పీటర్సన్ రాసిన కథనం పేర్కొంది. బీజేపీ హిందూ జాతీయవాద ఎజెండాతో పాటు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఉన్న ప్రజాదరణ వల్ల ప్రధాని కావడం అనివార్యమని పత్రిక పేర్కొంది. ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలతో నిండిపోయిందని వెల్లడించింది.

ALSO READ : Ram Mandir QR code scam : రామమందిరం పేరిట క్యూఆర్ కోడ్ స్కాం…హిందూ సంస్థల హెచ్చరిక

ప్రతిపక్షాలన్నీ ఇండియా కూటమిగా ఏర్పడిన సమస్యలపై సమిష్ఠి పోరాటం చేయలేకపోయారని కథనం పేర్కొంది. గత 9 ఏళ్లలో బీజేపీ సర్కారు సాధించిన విజయాలను వికసిత భారత్ సంకల్ప్ యాత్రలో ప్రచారం చేస్తున్నారని ది గార్డియన్ పేర్కొంది. లోక్‌సభ ఎన్నికల విజయావకాశాలపై బీజేపీ నమ్మకంగా ఉందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ పాండా పేర్కొన్నట్లు కాలమ్ పేర్కొంది.