Tariff War: ట్రంప్ సుంకాల బాదుడుపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ.. వారికోసం రాజీపడే ప్రసక్తే లేదు..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ దిగుమతులపై భారీగా సుంకాలు విధించడంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.

Tariff War: ట్రంప్ సుంకాల బాదుడుపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ.. వారికోసం రాజీపడే ప్రసక్తే లేదు..

PM Narendra Modi responds on Trump tariff hike

Updated On : August 7, 2025 / 11:17 AM IST

PM Modi: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ దిగుమతులపై భారీగా సుంకాలు విధించారు. ఇప్పటికే భారత దిగుమతులపై 25శాతం సుంకాలను విధించిన ట్రంప్.. దానిని 50శాతానికి పెంచారు. అదనంగా జరిమానా, సుంకంగా దీనిని పేర్కొంటూ బుధవారం కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. ఈ టారిఫ్‌లతో భారతీయ వస్త్ర పరిశ్రమ, ఆక్వా రంగం, తోలు ఉత్పత్తులపై వెంటనే ప్రభావం పడనుంది. రొయ్యలు, జంతు సంబంధ ఉత్పత్తులపై అదనపు భారం పడింది. అయితే, ట్రంప్ సుంకాల మోతపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.

Also Read: ట్రంప్‌తో భేటీకానున్న రష్యా ప్రెసిడెంట్ పుతిన్.. భారత్‌పై సుంకాలు తగ్గుతాయా.. మీడియా ప్రశ్నకు ట్రంప్ ఏం చెప్పారంటే..?

రైతుల ప్రయోజనాలపై ఎన్నటికీ రాజీపడే ప్రసక్తే లేదంటూ అమెరికాను ఉద్దేశిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. గురువారం దివంగత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమాని ప్రధాని మోదీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ట్రంప్ సుంకాల పెంపుపై పరోక్షంగా స్పందించారు.

మోదీ మాట్లాడుతూ.. ‘‘రైతుల సంక్షేమమే మాకు అత్యంత ప్రాధాన్యం. రైతులు, మత్స్యకారులు, పాడిరైతుల ప్రయోజనాలకు సంబంధించిన విషయాల్లో ఎన్నటికీ రాజీపడబోం. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు వ్యక్తిగతంగా ఎంత మూల్యమైన చెల్లించేందుకు నేను సిద్ధంగా ఉన్నా. నేడు భారతదేశం దేశంలోని రైతులు, మత్స్యకారులు, పాడి రైతులకోసం సిద్ధంగా ఉంది’’ అంటూ ప్రధాని మోదీ పరోక్షంగా ట్రంప్ సుంకాల మోతపై వ్యాఖ్యానించారు.