ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి స్థిరాస్థులు పోలీసులు స్వాధీనం చేసుకోరాదు

  • Published By: venkaiahnaidu ,Published On : September 24, 2019 / 02:58 PM IST
ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి స్థిరాస్థులు పోలీసులు స్వాధీనం చేసుకోరాదు

Updated On : September 24, 2019 / 2:58 PM IST

దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి సంబంధించిన స్థిరాస్తుల‌ను పోలీసులు స్వాధీనం చేసుకునే,సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని ఇవాళ(సెప్టెంబర్-24,2019)సుప్రీంకోర్టు త‌న తీర్పులో తెలిపింది. ఫ్ జ‌స్టిస్ రంజ‌న్ గ‌గోయ్‌, జ‌స్టిస్ దీప‌క్ గుప్తా, సంజీవ్ ఖ‌న్నాల‌తో కూడిన ఇద్దరు సభ్యుల ధర్మాసనం ఈ తీర్పు వెల్లడించింది. 

2010 లో ముంబై హైకోర్టు జారీ చేసిన ఇలాంటి ఉత్తర్వులకు వ్యతిరేకంగా మహారాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ కోర్టు విచారణ జరిపింది.  ఒక ప్రొఫెసర్ చేసిన కంప్లెయింట్ పై దర్యాప్తు చేస్తున్నప్పుడు పోలీసులు తన ఆస్తులను సీజ్ చేశారని,సీజ్ చేసిన తన ఆస్తులను తిరిగి ఇప్పించాలని కోరుతూ పూణేకు చెందిన డెవలపర్ సుధీర్ కర్ణాటకి పిటిషన్ పై 2010లో ముంబై హైకోర్టు  దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో విచార‌ణ ఎదుర్కొంటున్న వ్యక్తికి సంబంధించిన స్థిరాస్తుల‌ను పోలీసులు స్వాధీనం చేసుకునే,సీజ్ చేసే అధికారం పోలీసులకు లేద ని2010లో ముంబై హైకోర్టు తెలిపింది. హైకోర్టు తీర్పుని మ‌హా ప్ర‌భుత్వం సుప్రీంలో స‌వాల్ చేసింది.

దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి సంబంధించిన బ్యాంకు అకౌంట్లు సీజ్ చేసే అధికారం పోలీసులకు ఉందని గతంలో తాపస్ నియోగి కేసులో సుప్రీం ఇచ్చిన తీర్పుని తన పిటిషన్ లో మహా ప్రభుత్వం ప్రస్తావించింది. అయితే సీఆర్‌పీసీలోని 102వ సెక్ష‌న్ ప్ర‌కారం.. క్రిమిన‌ల్ కేసులో విచార‌ణ ఎదుర్కొంటున్న వ్య‌క్తి స్థిరాస్థులను టాచ్ చేసే,సీజ్ చేసే అధికారం పోలీసుల‌కు లేద‌ని సుప్రీంకోర్టు ఇవాళ సృష్టం చేసింది.