Chennai Cop : బస్సులో ప్రయాణికులపై కానిస్టేబుల్ దాడి.. కండక్టర్ ఏం చేశాడో చూడండి!
పోలీసు కానిస్టేబుల్ బస్సులో వీరంగం సృష్టించాడు. సీటులో కూర్చోమని అడినందుకు కండక్టర్‌పైనా దాడికి దిగాడు. సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా తోటి ప్రయాణికులపైన కూడా దాడికి యత్నించాడు.

Police Constable Lashes Out At Fellow Passengers Sitting In The Seat
Chennai Cop attacks Commuters : పోలీసు కానిస్టేబుల్ బస్సులో వీరంగం సృష్టించాడు. సీటులో కూర్చోమని అడినందుకు కండక్టర్‌పైనా దాడికి దిగాడు. సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా తోటి ప్రయాణికులపైన కూడా దాడికి యత్నించాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. తాను పోలీసు అంటూ తప్పతాగి బస్సులో తోటి ప్రయాణీకులు, కండక్టర్‌పై దాడి చేశాడు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. చెన్నైలోని వండలూర్-కోయంబేడు మధ్య తిరిగే 70V సిటీబస్‌లో జరిగింది.
வண்டலூர் முதல் கோயம்பேடு வரை செல்லக்கூடிய மாநகர பேருந்தில் காவலர் ஒருவர் குடிபோதையில் பயணிகளிடம் தகராறில் ஈடுபடும் வீடியோ சமூக வலைதளங்களில் வைரலாக வருகிறது #crime #policeviral @Im_VelayuthaN @amico_del_ur @selvasuha pic.twitter.com/2WoEggazGP
— Divakar (@divakarMathew) November 30, 2021
బస్సుల్లో ప్రయాణికులంతా ఎంతగా వారించినా అతడు వినలేదు. నానా హంగామా చేశాడు. అడ్డొచ్చినవారిపై కూడా దాడికి పాల్పడ్డాడు. దాంతో సహనం కోల్పోయిన ప్రయాణీకులు చివరికి అతన్ని బలవంతంగా బస్సులో నుంచి కిందికి దింపేశారు. వైరల్ వీడియో ఆధారంగా నిందితుడిని గుర్తించిన చెన్నై పోలీసులు చర్యలు చేపడతామని వెల్లడించారు.
நான் போலீஸ்., என்னை உங்களால் ஒன்றும் செய்யமுடியாது.! மது போதையில் அலப்பறை கொடுத்த போலீஸ்.!#CHENNAI #POLICE #BUS #TAMILNADU https://t.co/ywYEIH7mlS
— Seithi Punal (@seithipunal) November 30, 2021
Read Also : Omicron Threat : ‘ఎట్ రిస్క్’ దేశాల నుంచి ఢిల్లీకి వచ్చిన నలుగురికి కరోనా