Police Officer: తుపాకీతో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్య.

స్ఐగా విధులు నిర్వహిస్తున్న రాహుల్ సింగ్ (31) తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. ఢిల్లీ పోలీస్ విభాగంలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు రాహుల్ సింగ్.

Police Officer: తుపాకీతో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్య.

Police Shoot

Updated On : June 4, 2021 / 5:56 PM IST

Police Officer: ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న రాహుల్ సింగ్ (31) తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. ఢిల్లీ పోలీస్ విభాగంలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు రాహుల్ సింగ్. మృతదేహం వద్ద ఎలాంటి సూసైడ్ నోట్ కనిపించలేదని, ఎస్ఐ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని ఢిల్లీ ఈస్ట్ విభాగం డీసీపీ ప్రియాంక కశ్యప్ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టినట్లు వివరించారు. కాగా మృతుడు రాహుల్ సింగ్ ది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రా జిల్లాగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.