Maoist : మావోయిస్టు పార్టీ పీఎల్జీఏ వారోత్సవాలు .. ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో హై సెక్యురిటి

మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. మావోయిస్టు పార్టీ పీఎల్జీఏ వారోత్సవాల నేపథ్యంలో తాజాగా ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో హై సెక్యురిటిని ఏర్పాటు చేశారు.

Maoist : మావోయిస్టు పార్టీ పీఎల్జీఏ వారోత్సవాలు ..  ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో హై సెక్యురిటి

Police Officials Alert With Maoist Varotsavalu

Maoist affected states : మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. మావోయిస్టు పార్టీ పీఎల్జీఏ వారోత్సవాల నేపథ్యంలో తాజాగా ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో హై సెక్యురిటిని ఏర్పాటు చేశారు. భద్రతను కట్టుదిట్టం చేశారు.తెలంగాణ, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, ఒడిశాలలో కేంద్ర బలగాలు కూబింగ్ నిర్వహిస్తున్నాయి. మావోల వారోత్సవాలను భగ్నం చేసేందుకు చర్యలు చేపట్టారు. దీని కోసం ముందుస్తుగానే ప్రత్యేక నిఘా వేశారు. మావోల ప్రభావిత రాష్ట్రాలతో పాటు రాష్ట్రాల సరిహద్దుల్లో డ్రోన్లతో మావోల కదలికలపై కన్నేశారు.

దీంట్లో భాగంగా భద్రాద్రి గోదావరి తీర ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. భద్రాచలం,వెంకటాపురం, వాజేడు మండలాల్లో డ్రోన్ కెమెరాలతో పోలీసులు మావోల కదలికలపై నిఘా వేశారు. ప్రత్యేక ఏర్పాట్లతో జల్లెడ పడుతున్నారు. పలు రాష్ట్రాల్లో కూబింగ్ లో సీఆర్పీఎఫ్, గ్రేహౌండ్స్, కోబ్రా బలగాలు పాల్గొన్నాయి. అణువణువు గాలిస్తున్నారు. మావోయిస్టుల సానుభూతిపరులపై కన్నేసి ఉంచారు. వారి కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.

మావోలకు కొరియర్లుగా పనిచేసేవారిని గుర్తించి వారిని అదుపులోకి తీసుకుని మావోల జాడ గురించి తెలుసుకునే యత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం. అలాగే మావోల వారోత్సవాల సందర్భంగా పార్టీ రిక్కూట్ మెంట్ల పై కూడా దృష్టిపెట్టినట్లుగా తెలుస్తోంది. అలాగే మావోలు తమ ఉనికి కోసం ఏదైనా విధ్వంసాలకు పాల్పడే అకాశాలుండటంతో దానిపై కూడా ప్రత్యేక నిఘా పెట్టారు. నిఘా వర్గాల సమాచారంతో సరిహద్దు ప్రాంత గిరిజన గ్రామాలతో పాటు రూరల్ ప్రాంతాలకు చెందిన గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ ఆస్తులకు భద్రత ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది.