Assembly Elections 2023: రాజస్థాన్‌లో గంట గంటకూ పెరిగిన ఓటింగ్.. కాంగ్రెస్, బీజేపీలో ఎవరికి లాభం, ఎవరికి నష్టం?
ఓటింగ్ పెరగడం పట్ల భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఇంతకు ముందు పోలింగును పరిశీలించినట్లైతే పోలింగ్ పెరిగిన ప్రతీ సందర్భంలో అధికార పార్టీ నష్టపోయింది

రాజస్థాన్‌లో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. సాయంత్రం 5 గంటల వరకు 68.24 శాతం పోలింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇకపోతే, రాజస్థాన్‌లోని 200 అసెంబ్లీ స్థానాల్లో 199 స్థానాల్లో ఓటింగ్ జరిగింది. బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఎవరికి వారు తమదే విజయమని చెప్పుకుంటున్నారు. కాగా, రాష్ట్రంలో పోలింగ్ సరళి ఆసక్తికరంగా కొనసాగింది. ఉదయం 9 గంటల నుంచి ఓటింగ్ ఒక్కసారిగా ఊపందుకుంది. ప్రతి రెండు గంటలకు 15 శాతం పోలింగ్ పెరుగుతూ వచ్చింది. ఈ ట్రెండ్ చూస్తే గత ఎన్నికల్లో కంటే ఈసారి ఎక్కువ ఓటింగ్ నమోదు అయ్యేలాగే కనిపిస్తోంది.
మొదటి రెండు గంటల్లో 9.77% ఓటింగ్ జరిగింది. ఆ తర్వాత ఓటింగ్ ఊపందుకుంది. ప్రతి రెండు గంటలకు దాదాపు 15 శాతం ఓటింగ్ నమోదు అవుతోంది. ఉదయం 11 గంటల సమయానికి ఓటింగ్ సంఖ్య 24.74 శాతానికి చేరుకుంది. ఇక మధ్యాహ్నం 1 గంటలకు 40.27 శాతానికి రాగా, 3 గంటలకు 55.63 శాతం, సాయంత్రం 5 గంటలకు 68.24 శాతానికికి చేరుకుంది. ఓటింగ్‌కు ఇంకా గంట సమయం ఉంది. రాజస్థాన్‌లో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 74.06% ఓటింగ్ జరిగింది. ప్రస్తుత ఓటింగ్ సరళి చూస్తే 2018లో ఓటింగును క్రాస్ చేసేలానే కనిపిస్తోంది.
కాగా, ఓటింగ్ పెరగడం పట్ల భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఇంతకు ముందు పోలింగును పరిశీలించినట్లైతే పోలింగ్ పెరిగిన ప్రతీ సందర్భంలో అధికార పార్టీ నష్టపోయింది. దీన్ని బట్టి చూస్తే రాజస్థాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఓటింగ్ పెరగడం వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం జరగనున్నట్లే కనిపిస్తోంది. దీంతో బీజేపీ అధికారం కైవలం చేసుకోవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో ఇది అధికార పార్టీకి కలిసి వచ్చింది కూడా. మరి ఆ విధంగా చూస్తే ఇది కాంగ్రెస్ పార్టీకి మేలే చేస్తుంది. బీజేపీకి నష్టం జరగొచ్చు. ఇప్పటికి విడుదలైన ఒపీనియన్ పోల్ సర్వేల్లో ఎక్కువగా బీజేపీకి అనుకూలంగా ఫలితాలను ఇచ్చాయి. మరి రాజస్థాన్ ప్రజలు ఎవరికి అనుకూలంగా తీర్పు చెప్పారో తెలియాలంటే డిసెంబర్ 3 వరకు ఆగాల్సిందే.