ఉత్తరభారతమంతా వాయు కాలుష్యమే..కేంద్రం పట్టించుకోవటంలేదు

Delhi : వాయు కాలుష్యం..మనుషుల ప్రాణాల్ని నిలువునా తీసేస్తుంది. కనిపించకుండా ప్రాణాల్ని హరించేస్తుంది. భారత్ లో వాయుకాలుష్యం అనగానే మనకు ఠక్కున గుర్తుకొచ్చేది దేశ రాజధాని ఢిల్లీ. కానీ ఈ వాయుకాలుష్యం కేవలం ఢిల్లీ వరకే పరిమితం కాలేదని.. మొత్తం ఉత్తర భారతంపై దీని ప్రభావం ఉందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా వ్యాఖ్యానించారు.
ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించేందుకు తమ ప్రభుత్వం ఏడాది పొడవునా కృషి చేస్తోందని..కానీ ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు సుసోడియా.
పంజాబ్, హర్యానాల్లో రైతులు వరి, గోధుమ దిబ్బలను పొలాల్లోనే తగలబెట్టడం ప్రతి సంవత్సరం జరిగేదే. ఈ కాలుష్యం వల్ల ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీనిపై ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఈ వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల్లో పొలాల్లో తగులబెట్టిన పొగ వల్ల ఉత్తరాది మొత్తం ఇబ్బంది పడుతున్నా కేంద్ర ప్రభుత్వం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తోందని విమర్శించారు. కాలుష్య నివారణలో కేంద్రం తన వంతు పాత్రను పోషించాల్సిన అవసరం ఉందని సిసోడియా కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ఎవరి ప్రయత్నం వారు చేయాలని అప్పుడే ఈ వాయి కాలుష్యం నుంచి ఉత్తరాంధ్ర కోలుకుంటుందని అన్నారు.
కాలుష్యానికి కరోనా వైరస్ కూడా తోడు కావడం ప్రజలకు ప్రమాదకరంగా మారిందని..ఈ శీతాకాలంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సుసోడియా అన్నారు.