శివసేన చీఫ్ ఇంటిముందు పోస్టర్లు…ఉద్దవ్ ఠాక్రేనే మహా సీఎం

  • Published By: venkaiahnaidu ,Published On : November 10, 2019 / 11:09 AM IST
శివసేన చీఫ్ ఇంటిముందు పోస్టర్లు…ఉద్దవ్ ఠాక్రేనే మహా సీఎం

Updated On : November 10, 2019 / 11:09 AM IST

మహారాష్ట్ర రాజకీయాలు ఆశక్తికరంగా మారాయి. శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే కుమారుడైన 29ఏళ్ల ఆదిత్య ఠాక్రే కాబోయే సీఎం అంటూ మహారాష్ట్ర అంతటా, ముఖ్యంగా ముంబైలో ఇప్పటివరకు పోస్టర్లు వెలిశాయి. కాబోయే సీఎం ఆదిత్యే అంటూ శివసేన నాయకులూ కూడా చెబుతూ వచ్చారు. అయితే ఆదివారం ముంబైలోని ఉద్దవ్ ఠాక్రే నివాసం మాతోశ్రీ ముందు ఓ పోస్టర్ ఇప్పుడు ఆశక్తికరంగా మారింది. ఒక్కసారిగా ఉద్ధవ్ ఠాక్రే సీఎం అంటూ పోస్టర్లు వెలిశాయి.

మహారాష్ట్రలో ఏర్పడిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ పోస్టర్‌కు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. ఇప్పటి వరకు ఆదిత్యే సీఎం అని శివసేన నాయకులు చెబుతూ వస్తుండగా, హఠాత్తుగా ఉద్ధవే సీఎం అంటూ పోస్టర్ రావడం ఒక్కసారిగా కలకలం రేగింది. ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్రకు సీఎం కావాలి’’ అని అందులో వుంది. ఈ పోస్టర్లో బాలాసాహెబ్, ఉద్ధవ్ ఠాక్రేతో పాటు ఆదిత్య ఠాక్రే ఉన్నారు.