Prakash Raj: చంద్రయాన్-3ను ఉద్దేశిస్తూ ప్రకాశ్ రాజ్ ట్వీట్.. మండిపడుతున్న నెటిజన్లు.. ఎందుకంటే?

చంద్రయాన్-3 భారతదేశానికి గర్వకారణం. కానీ, ప్రకాశ్ రాజ్ అతని గుడ్డి ద్వేషంకోసం శాస్త్రవేత్తలను ఎగతాళి చేయడం సరికాదని నెటిజన్లు మండిపడుతున్నారు.

Prakash Raj: చంద్రయాన్-3ను ఉద్దేశిస్తూ ప్రకాశ్ రాజ్ ట్వీట్.. మండిపడుతున్న నెటిజన్లు.. ఎందుకంటే?

Prakash Raj

Updated On : August 21, 2023 / 12:09 PM IST

Prakash Raj- Chandrayaan 3: ఇస్రో (ISRO) ప్రయోగించిన చంద్రయాన్-3 (Chandrayaan 3) చంద్రుడిపై అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. మరికొద్ది గంటల్లో చంద్రుడు (Moon) దక్షిణ ధ్రువం ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ (Vikram Lander ) అడుగు పెట్టనుంది. ఈ ప్రక్రియ విజయవంతం అయితే ఇస్రో సరికొత్త రికార్డు సృష్టించనుంది. ఈనెల 23న సాయంత్రం 6.04 గంటల సమయంలో చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ అడుగిడుతుందని ఇస్రో తెలిపింది. రష్యా లూనా-25 ప్రయోగం విఫలం కావడంతో.. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3వైపు చూస్తున్నాయి. దేశం మొత్తం చంద్రయాన్-3 గురించి మట్లాడుకుంటుంది. ఈక్రమంలో సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ట్విటర్ వేదికగా ఓ ఫొటోను షేర్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

Chandrayaan-3 : చంద్రయాన్ 3 ల్యాండింగ్‌కు ముందు ఇస్రో విడుదల చేసిన చంద్రుడి తాజా చిత్రాలు

ప్రకాశ్ రాజ్ షేర్ చేసిన ఫొటోలో.. ఓ వ్యక్తి లుంగీలో టీ పోస్తున్నట్లు ఉంది. అది కార్టూన్ రూపంలో ఉంది. ఈ ట్వీట్ కు ప్రకాశ్ రాజ్ ఇలా రాశారు..‘బ్రేకింగ్ న్యూస్.. చంద్రుని నుండి వస్తున్న మొదటి చిత్రం #VikramLander వావ్’ అంటూ రాశారు. ప్రకాశ్ రాజ్ షేర్ చేసిన ఫొటో చాయ్ వాలాను పోలిఉంది. దీంతో ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి ఈ పోస్టు పెట్టినట్లుగా నెటిజన్లు భావిస్తున్నారు. చంద్రయాన్-3 ప్రయోగాన్ని ఉద్దేశిస్తూ వ్యంగ్యంగా ప్రకాశ్ రాజ్ పోస్టు ఉండటంతో మండిపడుతున్నారు.

Chandrayaan-3: టైం మార్చేసిన ఇస్రో.. 23న సాయంత్రం 6.04 గంటలకు ఏం జరుగుతుంది.. సర్వత్రా ఉత్కంఠ .. లైవ్‌లో వీక్షించే అవకాశం

చంద్రయాన్-3 భారతదేశానికి గర్వకారణం. కానీ, ప్రకాశ్ రాజ్ అతని గుడ్డి ద్వేషంకోసం శాస్త్రవేత్తలను ఎగతాళి చేయడం సరికాదని నెటిజన్లు మండిపడుతున్నారు. ఓ నెటిజన్ల ఇలా రాశారు.. ప్రకాశ్ రాజ్.. చంద్రయాన్ మిషన్ ఇస్రో ప్రయోగించింది.. బీజేపీది కాదు. మీరు విమర్శించాలనుకుంటే ఇండియాను కాదు.. ఏదైనా పార్టీని విమర్శించుకోండి అంటూ సలహా ఇచ్చాడు. ప్రకాశ్ రాజ్ ట్వీట్‌పై బీజేపీ నేతలుసైతం తీవ్ర స్థాయిలో  ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.