Independence Day: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ప్రసారం కోసం ఎన్ని కెమెరాలు వాడుతున్నారో తెలుసా?
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ప్రసారం కోసం ప్రసార భారతి 41 కెమెరాలను వాడనుంది. 36 కెమెరాలు ఎర్రకోట వద్ద..

Independence Day -2023
Independence Day -2023: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఢిల్లీ(Delhi)లోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేయనున్న నేపథ్యంలో ఈ వేడుకలను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి ప్రసార భారతి (Prasar Bharati )ఏర్పాట్లు చేసుకుంటుంది.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ప్రసారం కోసం 41 కెమెరాలను వాడనుంది. 36 కెమెరాలు ఎర్రకోట వద్ద, 5 కెమెరాలు రాజ్‌ఘాట్ వద్ద ఏర్పాటు చేశారు. వాటిలో 5 రోబోటిక్ కెమెరాలు, రెండు 360-డిగ్రీల కెమెరాలు ఉన్నాయి. క్లిష్టమైన సెటప్‌లో అదనంగా 360-డిగ్రీ వీక్షణ కెమెరాలు ఏర్పాటు చేశారు.
డైనమిక్ కెమెరా యాంగిల్స్ ఇవ్వడానికి జిమ్మీ జిబ్స్‌పై 4 కెమెరాలు, సిజర్ క్రేన్‌పై ఒక కెమెరా ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 6.15 గంటల నుంచి ప్రసార భారతి ప్రత్యక్ష ప్రసారాలు ప్రారంభమవుతాయి. కాగా, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు వృత్తులకు చెందిన దాదాపు 1,800 మందిని ఆహ్వానించింది. ప్రత్యేక అతిథుల లిస్టులో 400 మంది సర్పంచ్‌లు కూడా ఉన్నారు. ఢిల్లీతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత కొనసాగుతుంది.
#WATCH | Delhi: Security tightened ahead of Independence Day celebrations in the National Capital.
(Visuals from Sarojini Nagar) pic.twitter.com/6lSmr1z3IF
— ANI (@ANI) August 14, 2023