President Draupadi Murmu : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది షెడ్యూల్ ఖరారు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది షెడ్యూల్ ఖరారు అయింది. శీతాకాల విడిదిలో భాగంగా డిసెంబర్ 26న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణకు రానున్నారు. ఐదు రోజుల పర్యటనలో భాగంగా ఈనెల 30 వరకు ద్రౌపది ముర్ము రాష్ట్రంలోని వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 26న మధ్యాహ్నం 3 గంటలకు శ్రీశైలం నుంచి హైదరాబాద్ కు చేరుకోనున్నారు.

Draupadi Murmu
President Draupadi Murmu : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది షెడ్యూల్ ఖరారు అయింది. శీతాకాల విడిదిలో భాగంగా డిసెంబర్ 26న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణకు రానున్నారు. ఐదు రోజుల పర్యటనలో భాగంగా ఈనెల 30 వరకు ద్రౌపది ముర్ము రాష్ట్రంలోని వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 26న మధ్యాహ్నం 3 గంటలకు శ్రీశైలం నుంచి హైదరాబాద్ కు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 3.05 గంటలకు 3.15 గంటల వరకు సికింద్రాబాద్ బొల్లారంలోని యుద్ధ స్మారకం వద్ద పుష్పాంజలి ఘటిస్తారు. ఆ తర్వాత వీరనారీలను సత్కరిస్తారు. రాత్రి 7.45 గంటలకు రాజ్ భవన్ లో విందు కార్యక్రమంలో పాల్గొంటారు.
డిసెంబర్ 26న మధ్యాహ్నం 3.05 నుంచి 3.15 వరకు సికింద్రాబాద్ బొల్లారంలోని యుద్ద స్మారకం వద్ద పుష్పాంజలి. వీరనారీలకు సత్కారం. డిసెంబర్ 27న ఉదయం 10.30 నుంచి 11.30 వరకు నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ విద్యా సంస్థల్లో విద్యార్థులు, ఫ్యాకల్టీతో సమావేశం. డిసెంబర్ 27న మధ్యాహ్నం 3.00 నుంచి 4.00 గంటల వరకు సర్ధార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో అఖిల భారత పోలీస్ సేవల 74వ బ్యాచ్ ట్రైనీ అధికారులతోపాటు భూటాన్, నేపాల్, మాల్దీవులు తదితర దేశాల అధికారులతో సమావేశం.
President Draupadi Murmu : డిసెంబర్ 28న ప్రసాద్ పథకాన్ని ప్రారంభించనున్న రాష్ట్రపతి
డిసెంబర్ 28న ఉదయం 10.40 నుంచి 11.10 వరకు భద్రాచలంలోని సీతారామచంద్ర స్వామి ఆలయ సందర్శన ఉంటుంది. ప్రసాద్ పథకం ప్రారంభం. అనంతరం మిశ్రా ధాతు నిగం లిమిటెడ్ (మిథాని)కి సంబంధించిన వైడ్ ప్లేట్ మిల్ ప్లాంటును వర్చువల్ పద్దతిలో ప్రారంభించనున్నారు. డిసెంబర్ 28న మధ్యాహ్నం 3.00 నుంచి 3.30 వరకు వరంగల్ లోని రామప్ప ఆలయ సందర్శన. ప్రసాద్ ప్రాజెక్టు ప్రారంభం. డిసెంబర్ 29న ఉదయం 11.00 నుంచి 12.00 వరకు షేక్ పేటలోని జి.నారాయణమ్మ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మహిళా కాలేజీ సందర్శన.
విద్యార్థులు, ఫ్యాకల్టీతో సమావేశం. డిసెంబర్ 29న సాయంత్రం 5.00 నుంచి 6.00 వరకు శంషాబాద్ లోని శ్రీరామ్ నగర్ లో సమైక్యతామూర్తి విగ్రహ సందర్శన. డిసెంబర్ 30న ఉదయం 10.00 నుంచి 11.00 రంగారెడ్డి జిల్లాలోని కాన శాంతి వనంలో శ్రీ రామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన అంగన్ వాడీ, ఆశా వర్కర్లను ఉద్దేశించి ప్రసంగం.
Droupadi Murmu visit Tirumala : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
అనంతరం సాంస్కృతిక మంత్రిత్వశాఖ, శ్రీ రామ చంద్ర మిషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హర్ దిల్ ఛ్యాన్, హర్ దిన్ ధ్యాన్ ప్రచార కార్యక్రమం ప్రారంభం. డిసెంబర్ 30న మధ్యాహ్నం 1.00 గంటలకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి విందు ఏర్పాటు చేయనున్నారు.