Jharkhand Fire Incident : జార్ఖండ్ అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటన
జార్ఖండ్ లోని ధన్ బాద్ లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు.

Dhanbad fire incident
Jharkhand Fire Incident : జార్ఖండ్ లోని ధన్ బాద్ లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. ధన్ బాద్ లోని ఆశ్వీరాద్ అపార్ట్ మెంట్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందారు. మృతుల్లో నలుగురు చిన్నారులు, నలుగురు మహిళలు ఉన్నారు. మరో 15 మందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
13 అంతస్తుల అపార్ట్ మెంట్ లో భారీగా మంటలు చెలరేగాయి. మొదట రెండో అంతస్తులో మొదలైన మంటలు ఆ తర్వాత మిగిలిన అంతస్తులకు వ్యాపించాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పుతున్నారు. ఈ అపార్ట్ మెంట్ లో 400 మందికిపైగా నివాసం ఉంటున్నారు. అపార్ట్ మెంట్ లో అగ్నిప్రమాదం స్థానికంగా కలకలం రేపింది. అగ్నిప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. మృతుల కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Jharkhand Apartment Fire Accident : అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 14మంది సజీవదహనం
మంగళవారం సాయంత్రం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో ఆ అపార్ట్ మెంట్ కు వచ్చారు. ఇంతలో మంటలు చెలరేగి ఘోరం జరిగిపోయింది. కాగా, అగ్నిప్రమాదానికి కారణం తెలియాల్సి ఉంది. ప్రమాదంలో గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో మంటలు చెలరేగాయి.
ధన్ బాద్ డిప్యూటీ కమిషనర్ సందీప్ సింగ్ ఘటనా స్థలానికి వెళ్లి స్వయంగా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ అగ్నిప్రమాద ఘటనపై సీఎం హేమంత్ సొరేన్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. అపార్ట్ మెంట్ లో అగ్నిప్రమాదం జరిగి పలువురు చనిపోవడం విషాదకరం అన్నారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని సీఎం సోరేన్ అధికారులను ఆదేశించారు.